అక్టోబరు 4న ఐదో విడత సుందరకాండ అఖండపారాయణం _ FIFTH PHASE OF AKHANDA SUNDARAKANDA PATHANAM ON OCTOBER 4
Tirumala, 1 Oct. 20: The fifth phase of Akhanda Sundarakanda Pathanam will be organised at Nada Neerajanam platform in Tirumala on October 4 on Sunday.
On this day, 174 Shlokas from 15 to 19 Sargas will be recited by 200 Vedic pundits and scholars hailing from different Vedic institutions of TTD and also from National Vedic University and Rastriya Sanskrit Vidya Peeth.
The event will commence at 7am and last for almost two hours. There will be a rendition of Annamacharya Kriti and Bhajan at the beginning and ending of the programme.
It may be mentioned here that in the first phase of Sundarakanda Pathanam which was held on July 7 a total of 211 Shlokas from Prathama Sarga (first chapter), in the second phase held on August 6 a total of 227 Shlokas from second to seventh Sargas, on August 27 during the third phase, a total of 182 Shlokas from eighth to eleventh Sargas, on September 12 in the fourth phase a total of 146 Shlokas from twelfth to fourteen Sargas were recited.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అక్టోబరు 4న ఐదో విడత సుందరకాండ అఖండపారాయణం
తిరుమల, 2020 అక్టోబరు 01: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై అక్టోబరు 4వ తేదీ ఆదివారం ఐదో విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 15వ సర్గ నుంచి 19వ సర్గ వరకు ఉన్న 174 శ్లోకాలను పారాయణం చేస్తారు.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
కాగా, ఇప్పటివరకు నాలుగు విడతల్లో అఖండ పారాయణం జరిగింది. జూలై 7న మొదటి విడతలో మొదటి సర్గలోని 211 శ్లోకాలు, ఆగస్టు 6న రెండో విడతలో 2 నుండి 7వ సర్గ వరకు 227 శ్లోకాలు, ఆగస్టు 27న మూడో విడతలో 8 నుండి 11వ సర్గ వరకు 182 శ్లోకాలు, సెప్టెంబరు 12న నాలుగో విడతలో 12 నుండి 14వ సర్గ వరకు 146 శ్లోకాల అఖండ పారాయణం జరిగింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.