KARTHIKA VANABHOJANAM OBSERVED AT TCNR _ అధికారులు, సిబ్బంది సమ‌ష్టి కృషితో అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం: ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌

Tiruchanoor, 11 Dec. 19: Karthika Vanabhojanotsavam was observed with grand ecstasy at Friday Gardens in Tiruchanoor on Wednesday marking the successful completion of annual brahmotsavams of Sri Padmavathi Ammavaru from November 23 to December 1.

Speaking on this ceremonious occasion, the Deputy EO Sri C Govindarajan said under the instructions of TTD EO Sri Anil Kumar Singhal and in the time to time directions of JEO Sri P Basant Kumar, the Navahnika Karthika Brahmotsavams went off in a smooth manner without any incident. 

He thanked all the departments of TTD including the religious staff, police, district administration, Srivari Seva Volunteers and Scouts in making the event a grand success by working as a team with co-ordination and offering impeccable services to the multitude of visiting pilgrims who thronged the temple during the annual event.

Later Pancharatra Agama Advisor Sri Srinivasacharyulu said, the event was a grand success with the efforts of all the employees and the co-ordination between TTD Vigilance and police in making elaborate security arrangements. He said, every year, Vanabhojanam is being organised after the completion of brahmotsavams.

Earlier, Snapana Tirumanjanam was performed to Goddess Sri Padmavathi Devi at Friday Gardens.

Scores of devotees took part in the Vanabhojanam. Special Grade DyEO Smt Parvathi, DE Sri Chandrasekhar, Unit Officer Sri Amarnath Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

అధికారులు, సిబ్బంది సమ‌ష్టి కృషితో అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం: ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌

డిసెంబరు 11, తిరుప‌తి, 2019: అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్ తెలిపారు. నవంబరు 23 నుండి డిసెంబ‌రు 1వ తేదీ వరకు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు విజయవంతమైన నేపథ్యంలో బుధ‌వారం శుక్ర‌వార‌పుతోట‌లో వనమహోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా డెప్యూటీ ఈవో మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ఆదేశాల మేర‌కు అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలు నిర్వహించామ‌ని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భ‌క్తులు సంతృప్తిక‌రంగా వాహనసేవలతో పాటు మూలమూర్తి దర్శనం చేసుకున్నారని వివ‌రించారు. అర్చకులు సమయపాలనతో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించారని, మీడియా ప్రతినిధులతో పాటు భక్తులు చక్కటి సహకారం అందించారని తెలిపారు. ఇంజినీరింగ్‌, విజిలెన్స్‌, అన్న‌ప్ర‌సాదం, వైద్య‌, ఆరోగ్య విభాగం, ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలోని శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌ భక్తులకు మెరుగైన సేవలందించారని కొనియాడారు.

టిటిడి పాంచ‌రాత్ర ఆగమ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ఆనంతరం వనమహోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంద‌న్నారు. అందులో భాగంగా ఇక్కడ ఉద్యోగులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులకు అమ్మవారి ప్రసాదాలను అందిస్తున్నట్లు తెలిపారు.

అంతకు ముందు ఫ్రైడే గార్డెన్‌లో ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తికి స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఆనంతరం మహా నివేదన, వనమహోత్సవం, ప్రసాద వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో అన్న‌దానం ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి పార్వ‌తి, డిఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు, యూనిట్ అధికారి శ్రీ అమ‌ర‌నాథ‌రెడ్డి, అర్చ‌కులు శ్రీ ప్ర‌తాప్‌స్వామి, ఏఈవో శ్రీ శ్రీ‌నివాసులు, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల‌కృష్ణారెడ్డి, ఎవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర‌రావు, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి శ్రీ జ‌నార్ధ‌న్‌రెడ్డి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కోలా శ్రీ‌నివాసులు ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.