‘అధికారుల స్వామిభక్తి’ అను వార్త వాస్తవం కాదు

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
వివరణ(తిరుపతి, నవంబర్‌-23,2009)

 ‘అధికారుల స్వామిభక్తి’ అను వార్త వాస్తవం కాదు

నవంబర్‌ 23వ తేదిన ఈనాడు దినపత్రిక నందు ప్రచురించిన ‘అధికారుల స్వామిభక్తి’ అను వార్త వాస్తవం కాదు.

సదరు వార్తనందు అమ్మవారికి తప్పని ఎదురుచూపు, ఆలస్యంగా ప్రారంభమైన పుష్పయాగం అని కూడా వ్రాయడం సరికాదు.

ఆదివారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది.అయితే సదరు వార్తనందు అర్ధగంట ఆలస్యంగా ప్రారంభమైనదని, తితిదే కార్యనిర్వహణాధికారి రాక కోసం అధికారులు పుష్పయాగాన్ని అర్ధగంట ఆలస్యంగా ప్రారంభించారని వ్రాయడం సబబుకాదు. తితిదే కార్యనిర్వహణాధికారి కార్యక్రమం ప్రారంభానికి ముందే ఆలయంలో వున్నారు. అమ్మవారికి అలంకరణం చేస్తుండడం ఆలస్యమవుతున్నదని, కాసేపు ఆగిరమ్మని అర్చకులు ఇఓకు సలహా ఇవ్వడం జరిగింది. పిదప అలంకరణ పూర్తికాగానే అర్చకుల పిలుపుతో కార్యనిర్వహణాధికారి పుష్పయాగమునకు హాజరుకావడం జరిగింది. అమ్మవారికి అలంకరణ అలస్యం కావడం వలనే పుష్పయాగం కొంత ఆలస్యంగా ప్రారంభమైనదే కానీ తితిదే కార్యనిర్వహణాధికారి రాక వలన కాదని తెలియజేస్తున్నాము.

కనుక రేపటి మీ దినపత్రిక నందు ఈ విషయాన్ని వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు