SPIRITUAL POWER EMBEDDED IN ANNAMAIAH SANKEERTANS-SCHOLARS _ అన్నమయ్య సంకీర్తనలలో ఆధ్యాత్మిక శక్తి తరంగాలు : ఆచార్య భూమన కుసుమ కుమారి
TIRUPATI, 27 MAY 2024: To inculcate Dharmik and spiritual values among the people of his times, Sri Tallapaka Annamacharya penned his Sankeertans that which were popular even among the rural and common masses, said Prof Kusuma Kumari, former VC of SK University.
On the fifth day of the ongoing week-long 616th Birth anniversary celebrations Telugu Padakavita Pitamaha, Sri Tallapaka Annamacharya held at Annamacharya Kalamandiram in Tirupati, the literary session held on Monday was chaired by Smt Kusuma Kumari who spoke on Annamaiah – Tatvikata. She advocated that Annmaiah took forward the divine names in simpler form through Sankeertans in local jargon to reach wide range of devotees.
Among others, Telugu Scholar from Hyderabad Dr Srimannarayana spoke on Annamaiah Sankeertanallo Bhakti Sourabham while the Telugu Head of the department of SPWDPG Dr Krishnaveni spoke on Annamaiah Sankeertanalu-Sandesham and renowned scholar from Tanuku Sri Rasaraju delivered lecture on Srivari Sevalo Annamaiah.
Earlier, Annamacharya Project artists Smt Nagamani team from Tirupati rendered Harikatha Ganam on the occasion.
Annamacharya Project Director Dr Vibhishana Sharma, Program Assistant Smt Kokila and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అన్నమయ్య సంకీర్తనలలో ఆధ్యాత్మిక శక్తి తరంగాలు : ఆచార్య భూమన కుసుమ కుమారి
తిరుపతి, 2024 మే 27: ఆనాటి రాజకీయ కాలమాన పరిస్థితుల కారణంగా ప్రజల్లో అడుగంటిన భక్తిభావాన్ని చైతన్య పరిచి ఆధ్యాత్మిక సమైక్యత సాధించేందుకు శ్రీవేంకటేశ్వరస్వామివారిని కేంద్రంగా చేసుకుని అన్నమయ్య సంకీర్తనలు రచించి వ్యాప్తి చేశారని అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ విసి ఆచార్య భూమన కుసుమకుమారి పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు సోమవారం నాలుగవ రోజుకు చేరుకున్నాయి.
సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య భూమన కుసుమ కుమారి ”అన్నమయ్య – తాత్త్వికత ” అనే అంశంపై ఉపన్యస్తూ, వైరాగ్యం, విరక్తి, కోర్కేలు లేక పోవడం వంటి వాటిని ప్రభోదిస్తూ, ప్రజలను ఆధ్యాత్మికత, మోక్ష మార్గంలో నడేపేందుకు అన్నమయ్య సంకీర్తనను రచించిట్లు తెలిపారు. వేదాంతాన్ని భక్తి అనే రసగుళిక ద్వారా సామాన్య ప్రజలకు చేరువ చేసిన మహనీయుడు అన్నమయ్య అన్నారు. నామ సంకీర్తన, నామ జపంతో జాతి, కుల, మతాలకతీతంగా భగవంతుని చేరవచ్చని తెలిపారు. శ్రీవారిని సంకీర్తన ద్వారా సామాన్యులకు చేరువ చేసేందుకు అన్నమయ్య కృషి చేసినట్లు వివరించారు.
హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత అచార్యులు డా|| శ్రీమన్నారాయణ ”అన్నమయ్య సంకీర్తనల్లో – భక్తి సౌరభం” అనే అంశంపై ప్రసంగిస్తూ, భగవంతుని చేరడానికి భక్తి సులభమైనదన్నారు. వ్రతాలు, యగ్నయాగాలు తదితరవాటికి నియమాలు ఉంటాయని, కానీ భక్తికి ఎలాంటి నియమం ఉండవని తెలిపారు. భగవంతుని ప్రేమతో, భయంతో, స్నేహంతో, కోపంతో, ఎన్ని విధాలుగా ఆరాధించినా చేరుకోవచ్చని చెప్పారు. శ్రీనివాసుడు ఎంతటి మహిమ గల దేవుడో అన్నమయ్య అంతటి విశిష్టమైన భక్తుడన్నారు. భగవంతుని చేరేందుకు భక్తి సులభమైన మార్గమని, హరిభక్తులకు ఎలాంటి కొరత ఉండదని ప్రబోధించాడని తెలియజేశారు.
తిరపతి శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ, పిజి కళాశాల అధ్యాపకులు డా.క్రిష్ణవేణి ”అన్నమయ్య కీర్తనలు – సందేశం” అనే అంశంపై మాట్లాడుతూ, అన్నమయ్య సమాజం కోసం ప్రతి కీర్తనలో సందేశం అందించారన్నారు. సమాజాన్ని బాగు చేయడం, ప్రజల్లో భక్తి చైతన్యం తీసుకురావడం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. శరణాగతి తత్వాన్ని వైరాగ్యాన్ని తెలుసుకోవాలని ప్రబోధించినట్లు తెలియజేశారు. అన్నమయ్య వాగ్గేయకారులకు, కవులకు భాషా సందేశం, కీర్తనలు, కీర్తన అంశాల విధాన సందేశం, తాత్విక, సంగీత సందేశం ఇచ్చినట్లు వివరించారు.
తణుకుకు చెందిన ప్రముఖ సాహితీవేత్త శ్రీ రసరాజు ”శ్రీవారి సేవలో – అన్నమయ్య ” అనే అంశంపై ఉపన్యస్తూ, పద్యం పల్లకీలో ఊరేగుతున్న దశలో పాటలు బాగా రాయడానికి ప్రేరకుడు అన్నమయ్య అన్నారు. చక్రవర్తులు, రాజుల ఆస్థానాలలో పరిమళిస్తున్న పద్యానికి, సంకీర్తనల పరిమళాన్ని అందించిన మహనీయుడు అన్నమయ్య అని తెలిపారు. అష్టాక్షరి మంత్రంలోని 36 అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి పదివేల కీర్తనలు చొప్పున 32 వేల కీర్తనలు జాతికి అందించిన గొప్ప వాగ్గేయకారుడన్నారు. ప్రతి అడుగు శ్రీవారి సేవలో లీనమై, తనను తాను లీనం చేసుకున్న పరమ భాగవతుడని వివరించారు.
అంతకుముందు ఉదయం 9 గంటలకు తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ మతి నాగమణి బృందం హరికథ గానం చేశారు. అనంతరం విశాఖపట్నంకు చెందిన శ్రీ చైతన్య, చిన్నారి శృతిక బృందం సంగీతం, రాత్రి 7 గంటలకు కేరళకు చెందిన శ్రీ జాగర్లమూడి మాధవి కృష్ణ బృందం సంగీత సభ నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డా||విభీషణ శర్మ, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.