SRI GODA KALYANAM HELD IN A GRAND WAY AT ANNAMACHARYA KALA MANDIRAM _ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోదాకల్యాణం ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు

·      THIRUPPAVAI PRAVACHANAMS CONCLUDES

 Tirupati, 13 Jan. 21: As part of the concluding session of Dhanur masa festivities, Sri Goda Kalyanam was performed in a grand manner at the Sri Annamacharya Kala Mandiram on Wednesday morning.

It may be mentioned that during the holy Dhanur Masam TTD’s Divya Prabandam project had organised the Thiruppavai Pravachanams by eminent pundits at 141 locations across the country.

Amidst Veda Pathanam by Veda Parayanadars and Gosti by artists of the Annamacharya project, the Goda Kalyanam was performed in a celestial way. Earlier the utsava idols of Goddess Andal and Sri Ranganatha Swamy were brought to Annamacharya Kala Mandir in a procession.

Thereafter a scintillating dance ballad on Sri Goda Devi was performed by the troupe of Kumari M Bhanuja of Tirupati.

TIRUPPAVAI PRAVACHANAM CONCLUDES

The TTD’s Divya Prabandam Project had organised Tiruppavai Pravachanam by Sri Chakravarti Ranganathan at Annamacharya Kala mandiram from December 16 onwards which concluded on Bhogi festival.

TTD FA & CAO Sri O Balaji, Alwar Prabandam Project Incharge Acharya Rajagopalan and other devotees were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోదాకల్యాణం

ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు

తిరుప‌తి, 2021 జనవరి 13: పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో బుధ‌వారం శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 141 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు.

ముందుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీ గోదాదేవి(ఆండాళ్‌), శ్రీరంగనాథస్వామివారి ఉత్సవర్లను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు. వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గాత్రసంగీతం నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది.

అనంత‌రం తిరుప‌తికి చెందిన కుమారి ఎం.భానుజ బృందం గోదాదేవిపైన నృత్య‌రూప‌కాన్ని చ‌క్క‌గా ప్ర‌ద‌ర్శించారు.

అన్నమాచార్య కళామందిరంలో ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు

టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబరు 16 నుంచి దాదాపు నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై ప్రవచనాలు బుధ‌వారం ముగిశాయి. తిరుపతికి చెందిన శ్రీ చక్రవర్తి రంగనాథన్‌ ఇక్కడ తిరుప్పావై ప్రవచనాలు వినిపించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్ఆఏ అండ్ సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఇన్ చార్జి ప్రత్యేకాధికారి ఆచార్య రాజగోపాలన్, భక్తులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.