SRI GODA KALYANAM HELD _ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోదాకల్యాణం ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు
Tirupati, 14 January 2024: Andal Sri Goda Kalyanam was observed on Sunday at Annamacharya Kalamandiram in Tirupati to mark the end of the auspicious month of Dhanurmasam.
During Dhanurmasam, under the auspices of the TTD Alwar Divyaprabandha Project, Tiruppavai discourses were delivered by eminent scholars for a month across all the 216 centres in the country.
On this occasion, Dr Dwaram Lakshmi rendered Pasurams in a melodious manner. Similarly, the dance program organized by Kumari Bhanuja troupe from Tirupati was impressive.
Sri Chakravarty Ranganathan, a famous scholar of Tirupati, delivered the Tiruppavai Pravachans.
TTD FACAO Sri Balaji, AEO of Dharmic Projects Sri. Sriramulu, Superintendent Sri. Ramachandra, Alwar Divya Prabandha Project Coordinator Sri. Purushottam and devotees participated in this program.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోదాకల్యాణం
• ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు
తిరుపతి, 2024 జనవరి 14: పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 216 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు.
ముందుగా శ్రీ గోదాదేవి(ఆండాళ్), శ్రీరంగనాథస్వామివారి ఉత్సవర్లను వేదికపై కొలువుతీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు. వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గాత్రసంగీతం నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి ద్వారం లక్ష్మి సంగీత కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా తిరుపతికి చెందిన కుమారి భానుజ బృందం నిర్వహించిన నృత్య కార్యక్రమం ఆకట్టుకుంది.
అన్నమాచార్య కళామందిరంలో ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు
టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబరు 17 నుంచి దాదాపు నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై ప్రవచనాలు ఆదివారం ముగిశాయి. తిరుపతికి చెందిన ప్రముఖ పండితులు శ్రీ చక్రవర్తి రంగనాథన్ ఇక్కడ తిరుప్పావై ప్రవచనాలు వినిపించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, ధార్మిక ప్రాజెక్టుల ఏఈవో శ్రీ శ్రీరాములు, సూపరింటెండెంట్ శ్రీ రామచంద్ర, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.