SRI PADMAVATHI HRIDAYALAYA SERVICES ON PAR WITH CORPORATE APOLLO HOSPITAL- APOLLO CHIEF PRATAP REDDY _ అపోలో కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో శ్రీ పద్మావతి హృదయాలయం సేవలు- అపోలో ఆసుపత్రుల అధినేత డాక్టర్ ప్రతాప్ రెడ్డి
- APOLLO TO DONATE HEART TRANSPLANT EQUIPMENT
Tirupati, 05 September 2022: Dr C Prathap Reddy, founder Chairman of Apollo Hospitals group said on Monday that his group will donate all equipment needed for Heart Transplant Surgeries to the Sri Padmavati Hridayalaya.
Apollo Chief who visited the TTD Hridayalaya along with family members lauded that the medical services provided by Hridayalaya were on par with corporate Apollo group hospitals.
He visited the general ward, Cath lab and interacted with doctors and medical staff.
TTD EO Sri AV Dharma Reddy who accompanied the Apollo Chief informed that the SP Hridayalaya had since its inception completed over 600 heart surgeries, which included patients from Bangladesh also.
The EO also said that the institution is getting ready to conduct heart transplant procedures soon.
Speaking on the occasion Dr Prathap Reddy said the cleanliness, infection-free measures, medical services, surgeries, doctors, confidence, patient-attendant care etc. are extremely laudable in Hridayalaya.
Within a year the hospital has completed 600 surgeries and has given a new lease of life to infants and utmost happiness to the parents. He also announced the donation of heart transplant surgery equipment to SP Hridayalaya and said this is a golden opportunity provided by Sri Venkateswara to serve society. He also appreciated TTD for its stellar service to people during the covid season.
Dr Srinath Reddy, Director of SP Hridayalaya explained to Dr Prathap Reddy about the maintenance of Cath Lab, system of operations etc.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అపోలో కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో శ్రీ పద్మావతి హృదయాలయం సేవలు
– గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు అవసరమయ్యే యంత్రాలన్నీ విరాళంగా అందిస్తా
అపోలో ఆసుపత్రుల అధినేత డాక్టర్ ప్రతాప్ రెడ్డి
తిరుపతి 5 సెప్టెంబర్ 2022: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం (గుండె చికిత్సల ఆసుపత్రి) అపోలో ఆసుపత్రికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో వైద్య సేవలు అందిస్తోందని అపోలో ఆసుపత్రుల అధినేత డాక్టర్ ప్రతాప్ రెడ్డి చెప్పారు.
కుటుంబ సమేతంగా సోమవారం ఆయన శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రిని సందర్శించారు.. జనరల్ వార్డు, ఐసియూ లు, ఆపరేషన్ థియేటర్లు, క్యాత్ ల్యాబ్ విభాగాలను పరిశీలించారు. అక్కడి డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడారు.
ఆసుపత్రి ప్రారంభించిన ఏడాది లోపే 600 మందికి పైగా చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేశామని టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి డాక్టర్ ప్రతాప్ రెడ్డికి వివరించారు. బంగ్లాదేశ్ లాంటి ఇతర దేశాల నుంచి కూడా తల్లి తండ్రులు తమ పిల్లలను తీసుకుని వచ్చి ఆపరేషన్లు చేయించుకుని వెళ్లారని ఆయన తెలిపారు. త్వరలోనే గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
అనంతరం డాక్టర్ ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చిన్న పిల్లల హృదయాలయంలో శుభ్రత, ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించే చర్యలు, వైద్య సేవలు, సర్జరీలు చేస్తున్న విధానం, డాక్టర్లు, సిబ్బంది ఆత్మ విశ్వాసం ఎంతో గొప్పగా ఉన్నాయన్నారు. ఆసుపత్రి ప్రారంభించిన ఏడాది లోపే 600 మంది చిన్నారులకు డాక్టర్లు పునర్జన్మ ఇచ్చారని అభినందించారు. గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు అవసరమయ్యే యంత్ర సామగ్రి మొత్తం తమ కుటుంబం విరాళంగా అందిస్తుందని ప్రకటించారు. అలాగే అపోలో ఆసుపత్రుల నుంచి డాక్టర్లు ఇక్కడికొచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని తెలిపారు. విదేశాల్లో తమ ఆసుపత్రులకు సాంకేతిక, వైద్య సహకారం అందిస్తున్న పేరొందిన చిన్న పిల్లల ఆసుపత్రుల సేవలు కూడా అందేలా ఏర్పాటు చేస్తానని డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇది శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తనకు ఇచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో టీటీడీ ప్రజల కోసం ఎంతో గొప్ప సేవలు అందించిందని ఆయన అభినందించారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి క్యాత్ ల్యాబ్ నిర్వహణ, ఆపరేషన్లు చేసేందుకు పాటిస్తున్న విధానాలను డాక్టర్ ప్రతాప్ రెడ్డి కి వివరించారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది