KOIL ALWAR TIRUMANJANAM HELD AT APPALAYAGUNTA TEMPLE _ అప్పలాయగుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati,11 June 2024: TTD on Tuesday performed the sacred Koil Alwar Tirumanjanam fete ahead of the forthcoming annual Brahmotsavam from June 17-25 at Sri Prasanna Venkateswara Swamy temple in Appalayaguntaand. Ankurarpanam will be observed on the evening of June 16.

After the traditional temple cleansing fete with Parimalam mixture, Sarva Darshan commenced from 11am onwards.

Temple DyEO Sri. Govindarajan, chief archaka Sri Surya Kumar Acharyulu, Superintendent Smt Srivani, Temple inspector Sri Shiva and archakas were present.

Following are the details of Vahana Sevas

17-06-2024  Dwajarohanam in morning and Pedda Sesha Vahana in evening 

18-06-2024: Chinna Sesha Vahana and Hamsa Vahana 

19-06-2024: Simha Vahana and Muthyapu Pandiri Vahana 

20-06-2024: Kalpavruksha Vahana, Kalyanotsavam, Sarva bhupala Vahana.

21-06-2024: Mohini avataram and Garuda Vahana 

22-06-2024: Hanumanta Vahana and Gaja Vahana

23-06-2024: Surya Prabha Vahana and Chandra Prabha Vahana 

24-06-2024 : Rathotsavam and Aswa Vahana

25-06-2024 : Chakra snanam ans Dwajaavarohanam 

The interested couple could participate in the Kalyanotsavam on June 20 by paying ₹500 per ticket and beget one uttarium, one blouse, one laddu, one Appam besides the divine blessings. 

The artists of TTD projects, HDPP, Dasa Sahitya, Annamacharya will present Dharmic, cultural, Bhakti sangeet, bhajans and kolatams during the annual festival.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుప‌తి, 2024 జూన్ 11: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో జూన్ 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 8 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ప్రధాన అర్చకులు శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీమ‌తి శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివ‌, అర్చక బృందం పాల్గొన్నారు.

జూన్ 16న అంకురార్పణ

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు జూన్ 16వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది.

వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

17-06-2024

ఉదయం – ధ్వజారోహణం

సాయంత్రం – పెద్దశేష వాహనం

18-06-2024

ఉదయం – చిన్నశేష వాహనం

సాయంత్రం – హంస వాహనం

19-06-2024

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

20-06-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం – కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

21-06-2024

ఉదయం – మోహినీ అవతారం

సాయంత్రం – గరుడ వాహనం

22-06-2024

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – గజ వాహనం

23-06-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

24-06-2024

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వవాహనం

25-06-2024

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 20వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.