అమ్మవారి ఆలయంలో వసంతోత్సవం

అమ్మవారి ఆలయంలో వసంతోత్సవం

తిరుపతి, మే-5,  2009: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మేనెల 8 నుండి 10 వరకు మూడురోజులపాటు వార్షిక వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. అంకురార్పణం మే 7వ తేదిన నిర్వహిస్తారు.

వసంతోత్సవంలో పాల్గొన దలచిన గృహస్థులు ఒకటిక్కెటుకుగాను రూ.300/-లు చెల్లించాలి. ఒక్కటిక్కెట్టుకు ఒకరోజుకుగాను ఇద్దరిని అనుమతిస్తారు. వీరికి ఒక అంగవస్త్రం, రవికె, రెండు లడ్డులు బహుమానంగా ఇస్తారు. ఈ సందర్భంగా తిరుచానూరులో ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, శ్వేత ఆధ్వర్యంలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.