ARCHAKAS SHOULD FOLLOW HEALTH SAFEGUARDS – AYURVEDIC EXPONENT DR P MURALI KRISHNA _ అర్చకులు ఆరోగ్య నియమాలపై అవగాహన పెంచుకోవాలి : డాక్టర్ పి.మురళీకృష్ణ
Tirupati, 07 February 2024: Ayurvedic expert Dr P Murali Krishna told archakas to follow health safeguards promptly with Yoga and meditation.
Addressing the second-day session of refresher classes for archakas at Sri Venkateswara Vedic University under the auspices of SVETA, Dr Murali Krishna said Yoga and Surya namaskar are crucial for a healthy life and keep their body and mind in righteous attitude.
Thereafter Sri Ramakrishna Deekshitulu, one of the chief archakas of Srivari temple spoke on health guidelines embedded in Agama shastra.
TTD vaikhanasa agama advisor Sri Seetharamacharyulu and other archakas of TTD temples were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
అర్చకులు ఆరోగ్య నియమాలపై అవగాహన పెంచుకోవాలి : డాక్టర్ పి.మురళీకృష్ణ
తిరుపతి, 2024, ఫిబ్రవరి 07: అర్చకులు ఆరోగ్య నియమాలపై అవగాహన పెంచుకోవాలని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పి.మురళీకృష్ణ కోరారు. టీటీడీ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ(శ్వేత) ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పునశ్చరణ తరగతులు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా డాక్టర్ పి.మురళీకృష్ణ “మన ఆరోగ్యం మన చేతుల్లోనే” అనే అంశంపై మాట్లాడుతూ వైద్యశాస్త్రంలో వ్యాయామానికి అధిక ప్రాధాన్యత ఉందన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలన్నారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగేందుకు యోగా ఉపకరిస్తుందన్నారు. అర్చకులు చేసే అనుష్టాన ప్రక్రియ ప్రాణాయామంలో ఒక భాగమేనన్నారు. మనసు లగ్నం చేసుకోవడానికి యోగా, సూర్య నమస్కారాలు దోహదం చేస్తాయని వివరించారు. అనంతరం ఆరోగ్యకర ఆహార అలవాట్ల గురించి తెలియజేశారు.
ఆ తరువాత తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీ రామకృష్ణ దీక్షితులు వైఖానస ఆగమంలోని అంశాలపై శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు శ్రీ పి.సీతారామాచార్యులు, టీటీడీ ఆలయాల వైఖానస అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.