అవగాహన లేక సిబ్బంది మీద భక్తులు తిరగబడ్డారు
అవగాహన లేక సిబ్బంది మీద భక్తులు తిరగబడ్డారు
విధినిర్వహణలో వున్న ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించి….భక్తులుకు వివరణ ఇవ్వడంతో క్షమాపణ కోరుతు లేఖ వ్రాసి ఇచ్చిన భక్తులు.
–
— టీటీడీ వివరణ
తిరుమల 26 డిసెంబరు 2020: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా అధిక రద్దీ వల్ల శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మహాలఘు దర్శనం ఉంటుందని టికెట్ మీద ముద్రించి ఇచ్చాము. ఈ విషయం మీద అవగాహన లేని ఐదుమంది భక్తులు ఈ రోజు తమను కులశేఖరపడి వరకు అనుమతించాల్సిందే నని పట్టుబట్టి జయ విజయుల వద్ద దాదాపు 25 నిముషాలు ఆగి వెనక ఉన్న వేలాదిమంది భక్తులకు ఆటంకం కలిగించారు. ఇవాళ 2 వేల శ్రీవాణి టికెట్లు జారి చెయ్యగా 1950 మంది భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లారు. ఐదు మంది భక్తులు మాత్రం జయవిజయుల వద్ద తమను ముందుకు వరకు అనుమతించాలని పట్టుబట్టారు . ఇలా ప్రతిఒక్కరు సిబ్బందితో వాగ్వివాదానికి దిగితే వెనకున్న భక్తులకు ఎలా దర్శనం చేయించగలమని సిబ్బంది ఐదు మంది భక్తులును ప్రాధేయపడ్డారు.
విశేష పర్వదినాలులో ఎక్కువ మంది భక్తులుకు దర్శనభాగ్యం కల్పించడానికి టిటిడి తీసుకున్న నిర్ణయాని ముందుగానే తెలియజేసామని… సమాచారాని టిక్కేట్లులో కూడా పోందుపర్చామని…. వెనుక వేచి వున్న భక్తులుకు దర్శనభాగ్యం కల్పించేందుకు టిటిడికి సహకరించాలవి విజ్ఞపి చేసినా ….. భక్త్తులు శాంతించక సిబ్బంది మీదే తిరుగు బాటు చేశారు. అయినప్పటికి సిబ్బంది వారితో సంయమనంతో వ్యవహరించి పరిస్థితిని వివరించడంతో…. చివరికి వారు చేసిన తప్పుని గ్రహించి…. క్షమాపణ కోరుతు టిటిడికి లేక వ్రాసిచ్చారు. కాని కోంత మంది దీని పై దుష్ప్రచారం చేస్తూండడం భాథాకరం.
టిటిడి ఎప్పటికి భక్తులు సేవలో వుంటుంది… ఉద్యోగులు అంకితభావంతో భక్తులుకు సేవలందిస్తూన్నారు. వారికి భక్తులు కూడా సహకరిస్తూన్నారు. ఇవాళ జరిగిన ఘటన భక్తులు అవగాహన లోపంతో జరిగినందున…. టిటిడి కూడా సానుకూల దృక్పథంతో వారికి అహగాహన కల్పిస్తూ…నిరంతరాయంగా భక్తులుకు సేవలందిస్తూంది .
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది