PRASANNA VENKATESWARA RIDES ASWA _ అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో  శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు 

TIRUPATI, 07 JUNE 2023: On the evening of the penultimate day of the ongoing annual brahmotsavam, Sri Prasanna Venkateswara took out a celestial ride on the last vahanam of the series, Aswa Vahanam.

 

The devotees were spell bound to see the processional deity in Kalki Avatara on Aswa Vahanam, at Appalayagunta on Wednesday.

 

DyEO Sri Govindarajan, Superintendent Smt Srivani and others were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో  శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

తిరుపతి, 2023 జూన్ 07: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.

వాహన సేవలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, సూప‌రింటెండెంట్ శ్రీమతి వాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.