GOVINDA SHINES IN KALKI ALANKARAM _ అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tirupati,2 June 2023: As part of the annual Brahmotsavam celebrations of Sri Govindarajaswami temple, on Friday night Lord Govindarajaswami shined in kalki alankaram on Aswa Vahana and blessed devotees.

Upanishads highlight the indriyas as hisses and the person who conquered Horses is qualified as controlling Indriyas as well. Parma is hailed as Kalki in Aswa Roopa.

Tirumala pontiffs Sri Sri Sri Pedda jeeyar Swamy and Sri Sri Sri Chinna jeeyar Swamy, Kankana bhattar Sri AP Srinivasa Dikshitulu, Dyeo Smt shanti, superintendent  Sri Mohan Rao, Inspector Sri Dhananjeyulu etc were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ గోవిందరాజస్వామి

తిరుపతి, 203 జూన్ 02: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్ర‌వారం రాత్రి క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.

వాహన సేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, కంకణబట్టార్ శ్రీ ఏపీ శ్రీనివాస దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూప‌రింటెండెంట్ శ్రీ మోహన్ రావు టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాధాకృష్ణ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.