JEO REVIEWS PROGRESS OF WORKS OF ASTADASHA PURANAM _ అష్టాద‌శ పురాణాల ప‌రిష్క‌ర‌ణ పురోగ‌తిపై జెఈవో స‌మీక్ష‌

అష్టాద‌శ పురాణాల ప‌రిష్క‌ర‌ణ పురోగ‌తిపై జెఈవో స‌మీక్ష‌

తిరుపతి, 2020 జనవరి 25: అష్టాద‌శ పురాణాల‌ పరిష్క‌ర‌ణ‌, గ్రంథ ముద్ర‌ణ ప‌నుల పురోగ‌తిపై టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో ఈ స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ అష్టాద‌శ‌(18) పురాణాల‌ను వ్యాఖ్యాన స‌హితంగా తెలుగు అనువాదంతో ముద్రించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, ఈ ప‌నులు వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ఈ పురాణాల ప‌రిష్కార మండ‌లి సోమ‌వారం నుండి శ‌నివారం వ‌ర‌కు 6 రోజుల పాటు స‌మావేశ‌మై మ‌త్స్య‌పురాణంలోని ఒక భాగాన్ని ప‌రిష్క‌రించి ముద్ర‌ణ‌కు సిద్ధం చేసి ముద్ర‌ణాల‌యానికి పంపిన‌ట్టు వివ‌రించారు. ఇప్ప‌టివ‌ర‌కు 5 పురాణాల‌ను ముద్ర‌ణ‌కు సిద్ధం చేశామ‌ని, 18 భాగాలు అనువాద‌మై ప‌రిష్క‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయ‌ని తెలియ‌జేశారు. ప‌రిష్క‌ర‌ణ మండ‌లి ప్ర‌తినెలా వారం రోజుల పాటు స‌మావేశ‌మై అనువాదం పూర్త‌యిన పురాణాల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని జెఈవో సూచించారు.

ఈ స‌మావేశంలో పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, ప‌రిష్క‌ర‌ణ మండ‌లి స‌భ్యులు డా. స‌ముద్రాల ల‌క్ష్మ‌ణ‌య్య‌, శ్రీ కందాడై రామానుజాచార్యులు, శ్రీ శ్రీ‌పాద సుబ్ర‌హ్మ‌ణ్యం, శ్రీ శ్రీ‌పాద స‌త్య‌నారాయ‌ణ‌, ఆచార్య ప్ర‌తాప్‌, శ్రీ ధూళిపాళ్ల మ‌హాదేవ‌మ‌ణి, ఆచార్య ధూళిపాళ్ల అన్న‌పూర్ణ‌, ఆచార్య సింగ‌రాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati, 25 Jan. 20: The Joint Executive Officer of TTD Sri P Basant Kumar has reviewed on the progress of Astadasha (18) Puranas in Telugu with commentary.

Addressing a review meeting at TTD administrative building in his chambers the JEO said the committee for scrutiny of puranas met for six days and finalised one portion of Matsya puranam and cleared it for printing, making it 5th of 18 puranas ready for printing.

He said rest of them would also be readied with Telugu translation by the scrutiny committee with 7 days sitting every month.

Purana Itihasa Project Special Officer and Secretary of HDPP Acharya Rajagopalan, Purana Review committee members Dr Samudrala Lakshmiah, Kandadai Sriramanuja Charyulu, Sri Pada Subramanyam, Sri Pada Satyanarayana, Acharya Pratap, Acharya Dhulipalla Mahadevamani, Acharya Dhulipalla Annapurna, and Acharya Singacharyulu also participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI