Gujarat CM assures land for SV temple at Ahmedabad,TTD chairman _ అహ్మదాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి ఇస్తాం- టీటీడీ చైర్మన్ కు సి ఎం హామీ
Tirumala, 05 September 2022: TTD Chairman Sri YV Subba Reddy said that the Gujarat Chief Minister Sri Bhupendra Rajanikanth Patel has assured allotment of land at Ahmedabad towards the construction of Sri Venkateswara Temple.
He had met the Gujarat CM along with TTD board member Sri Ketan Desai and presented Srivari Thirtha Prasadams and felicitated with a shawl.
During the meeting, the TTD chairman had explained the Gujrat CM about the various dharmic activities taken up by TTD as per the directions of Honourable AP CM Sri YS Jaganmohan Reddy as part of the propagation of Hindu Sanatana Dharma across the country.
The Chairman said TTD had commenced construction of Srivari temples at Jammu and completed at Bhubaneswar.
He had appealed to Gujarat CM to grant land freely for constructing Srivari temple in Ahmedabad on which the latter happily expressed his consent and assured to grant a suitable land after consultation with officials.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అహ్మదాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి ఇస్తాం
– టీటీడీ చైర్మన్ కు సి ఎం హామీ
తిరుమల 5 సెప్టెంబర్ 2022: అహ్మదాబాద్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి అనువైన భూమి కేటాయిస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర రజనీకాంత్ పటేల్ హామీ ఇచ్చారు.
టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి పాలక మండలి సభ్యులు శ్రీ కేతన్ దేశాయ్ తో పాటు సోమవారం ముఖ్యమంత్రి ని కలిశారు.
సి ఎం కు శ్రీవారి ప్రసాదం అందించి శాలువలతో సత్కరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారానికి చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రి కి వివరించారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఇటీవలే భువనేశ్వర్ లో శ్రీవారి ఆలయం ప్రారంభించామన్నారు. త్వరలోనే ముంబైలో స్వామివారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నామని చెప్పారు. గుజరాత్ లో కూడా స్వామివారి ఆలయ నిర్మాణానికి టీటీడీ కి ఉచితంగా భూమి కేటాయించాలని కోరారు. శ్రీ సుబ్బారెడ్డి ప్రతిపాదన పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అధికారులతో చర్చించి టీటీడీ కి అనువైన ప్రదేశంలో అవసరమైనంత భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే విడుదల చేయడమైనది