ఆకేపాటి చెంగల్ రెడ్డి మృతికి భక్తలోకానికి తీరని లోటు
ఆకేపాటి చెంగల్ రెడ్డి మృతికి భక్తలోకానికి తీరని లోటు
తిరుపతి, సెప్టెంబర్- 16 , 2009: ప్రపంచ ప్రఖ్యాంతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానముల పాలకమండలి ఛైర్మన్గా ఎంతో చిత్తశుద్ధితో, నిబద్దతతో పనిచేసిన ఆకేపాటి చెంగల్ రెడ్డి ఊపిరితిత్తులవ్యాధితో భాదపడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. వీరి మరణం ఇటు తితిదే ఉద్యోగులకు అటు భక్తలోకానికి తీరని లోటు అని తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ డి.కె. ఆదికేశవులునాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు ఒక ప్రకటనలో తమ సంతాపాన్ని తెలిపారు.
1925వ సంవత్సరం కడప జిల్లా చిట్వేలు మండలం, నగవర గ్రామంలో ఆకేపాటి చెంగల్ రెడ్డి జన్నించారు. గాందేయమార్గంలో నడుస్తూ 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.
పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్.ల్.సిగా, సాంఘిక సంక్షేమహస్టల్స్ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడానికి ఎనలేని కృషి చేసారు. మాజీముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో 1994-95 మద్యకాలంలో తితిదే పాలకమండలి ఛైర్మన్గా వ్యవహరించారు. దేవస్థానం పాలనా వ్యవహరాలలో ఆదర్శవంతమైన క్రమశిక్షణా పద్దతులు ప్రవేశపెట్టిన ఘనత ఆకేపాటి చెంగల్రెడ్డికే దక్కుతుంది. సామాన్య భక్తులకు వసతులు కల్పించడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. అదేవిధంగా తితిదే అనుబంధ విద్య,వైద్య సంస్థల అభివృద్ధికి ఆయన మరువ లేని కృషి చేశారు. ఈ సందర్బంగా ఆకేపాటి చెంగల్ రెడ్డి కుటుంబ సభ్యులకు వారు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మృతికి తితిదే ఒక రోజు సెలవును ప్రకటించింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.