ఆగస్టు 10న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు
ఆగస్టు 10న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు
తిరుపతి, 2012 ఆగస్టు 3: తితిదే శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల, శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
గోకుల నందనుడు, బృందావన విహారి, ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. సనాతన హిందూ ధర్మ ప్రచారమే ప్రధాన లక్ష్యంగా స్వీకరించిన తి.తి.దే హిందూవుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహించనుంది.
సాక్షాత్తు శ్రీ కృష్ణగోలోకాన్ని తలపించే విధంగా తి.తి.దే శ్రీవేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లను చేయనుంది. భారీగా పందిళ్ళు, మామిడితోరణాలు, పూమాలలతో అ
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.