ఆగస్టు 11న చిక్‌బళ్లాపూర్‌లో శ్రీనివాస కల్యాణం
ఆగస్టు 11న చిక్‌బళ్లాపూర్‌లో శ్రీనివాస కల్యాణం
తిరుపతి, ఆగస్టు 08, 2013: తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్‌లో ఆగస్టు 11వ తేదీన శ్రీనివాస కల్యాణం వైభవంగా జరుగనుంది. అక్కడి శ్రీ వేంకటరమణ స్వామి దేవాలయ జీర్ణోద్ధార ట్రస్టు ఆధ్వర్యంలో చిక్‌బళ్లాపూర్‌లోని గౌరిబిడియనూరు రోడ్డులో ఉన్న శ్రీ వేంకటరమణ ఆలయం పక్కన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 గంటలకు ప్రారంభం కానున్న శ్రీవారి కల్యాణోత్సవంలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ కె.రామకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనాలాపన చేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.