ఆగస్టు 12న తిరుచానూరు శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో గోకులాష్టమి

ఆగస్టు 12న తిరుచానూరు శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో గోకులాష్టమి
 
తిరుపతి, 2020 ఆగస్టు 10: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి వారి ఆలయంలో ఆగస్టు 12వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

గోకులాష్టమి రోజైన బుధ‌వారం ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు.  మధ్యాహ్నం 2.00 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ  జ‌రుగ‌నుంది. అనంతరం సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల‌ వరకు గోపూజ‌, గోకులాష్ట‌మి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

అదేవిధంగా  ఆగస్టు 13న గురువారం ఉట్లోత్స‌వంను పుర‌స్క‌రించుకొని మధ్యాహ్నం 2.00 నుండి 3.00 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.  

కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో గోకులాష్ట‌మిని ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.
           
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.