ఆగస్టు 15న తితిదే ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు
ఆగస్టు 15న తితిదే ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు
తిరుపతి, 2012 ఆగస్టు 13: తిరుమల తిరుపతి దేవస్థానంలో విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలందించిన ఉద్యోగులకు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డులను అందించనున్నారు. తితిదే పరిపాలనా భవనంలో బుధవారం స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఈ వేడుకల్లో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 107 మంది ఉద్యోగులు అవార్డులను అందుకోనున్నారు. అవార్డు కింద 5 గ్రాముల వెండి డాలర్, ప్రశంసాపత్రం అందించనున్నారు.
ఈ ఏడాది తితిదే ముఖ్య వైద్యాధికారి డాక్టర్ సి.ప్రభాకర్‌రావు ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. వైద్య విభాగంలో విశేష సేవలు అందించినందుకు గాను ఈయన్ను అధికారులు ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.