ఆగస్టు 17వ తేదిన శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవం 

ఆగస్టు 17వ తేదిన శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవం

తిరుపతి, ఆగష్టు -14,  2009: కార్వేటినగరంలో తితిదేకి చెందిన శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో ఆగస్టు 17వ తేదిన పవిత్రోత్సవం నిర్వహిస్తారు. ఇందుకై ఆగస్టు 16వ తేదిన అంకురార్పణం జరుగుతుంది.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలైన సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ ఊరేగింపు పూర్ణాహుతి నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.