ఆగస్టు 17,18వ తేదీల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 193వ వర్థంతి వేడుకలు
ఆగస్టు 17,18వ తేదీల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 193వ వర్థంతి వేడుకలు
తిరుపతి, 2010 ఆగష్టు 16: భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 193వ వర్థంతి వేడుకలు ఈ నెల 17,18వ తేదీలలో తిరుమల,తిరుపతి, తరిగొండలలో ఘనంగా జరుగుతాయి. రెండురోజుల పాటు జరిగే కార్యక్రమాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
తిరుపతిలో …. 17-08-2010
ఉదయం 10.00 – అన్నమాచార్య కళామందిరంలో వెంగమాంబ జీవితగాథ పై సెమినార్
సాయత్రం 6.00 – లాస్యప్రియ డ్యాన్స్ అకాడమి వారిచే నృత్యకార్యక్రమాలు
తరిగొండలో …..17-08-2010
సాయంత్రం6.00 గం||లకు – అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథ
18-08-2010
ఉదయం 9.00 గం||లకు -వెంగమాంబ సమాధివద్ద తితిదే చైర్మన్, ఇ.ఓలు పుష్పాంజలి సమర్పణ
తిరుపతిలో ….
ఉదయం 11.30 – వెంగమాంబ విగ్రహం వద్ద తితిదే ఛైర్మన్, ఇ.ఓలు పుష్పాంజలి సమర్పణ
సాయంత్రం 6.00- అన్నమాచార్య కళామందిరంలో వెంగమాంబ జీవిత చరిత్రపై నాటక ప్రదర్శన
తరిగొండ….
సాయంత్రం 6.00గం||లకు లక్షినరసింహ స్వామికళ్యాణోత్సవం
సాయంత్రం 7.00 గం||లకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత కచేరి.
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 20వ తేదిన వరలక్ష్మి వ్రతం వైభవంగా జరుగుతుంది. ఆర్జితంగా జరిగే ఈ పూజలో రూ.500/- చెల్లించి ఇద్దరు పాల్గొనవచ్చును.
అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 20వ తేదిన వరలక్షి వ్రతం ఘనంగా జరుగుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.