ఆగస్టు 18వ తేదీన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘అయినవారి కోసం గోవిందా… గోవిందా’ అనే వార్త‌కు వివరణ

ఆగస్టు 18వ తేదీన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘అయినవారి కోసం గోవిందా… గోవిందా’ అనే వార్త‌కు వివరణ

ఆగస్టు 18వ తేదీన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘అయినవారి కోసం గోవిందా… గోవిందా’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త వాస్తవదూరం.

తితిదేలో జూనియర్‌ అసిస్టెంట్‌ నుండి సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించేందుకు ఆగస్టు 13వ తేదీన 68 మందితో కూడిన అర్హుల జాబితాను ప్రకటించడమైనది. ఈ జాబితాలో ఏవైనా అభ్యంతరాలున్న యెడల ఆగస్టు 17వ తేదీ సాయంత్రం 5.00 గంటలలోపు తెలియజేయాలని ఉద్యోగులను కోరడం జరిగింది. కొందరు ఉద్యోగులు అభ్యంతరాలు తెలియజేశారు. వీటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం విడుదల చేసిన పదోన్నతి అర్హుల జాబితాలో దాదాపు 60 మందికి ఉద్యోగ నియామక తేదీ, ప్రొబేషన్‌ ఖరారైన తేదీ ఒకటే. కావున ఆంధ్రప్రదేశ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్‌ 36 ప్రకారం పుట్టిన తేదీని అనుసరించి పదోన్నతికి అర్హత గలవారి జాబితాను విడుదల చేయడం జరిగింది. అయితే ఉద్యోగి తండ్రి పదవీ విరమణ కాలం  నాటి నుండి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధనలు లేవు. ప్రస్తుతం విడుదల చేసిన పదోన్నతుల అర్హుల జాబితాలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదు.

కనుక పైతెల్పిన వాస్తవాల్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సినదిగా కోరడమైనది.


ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి