ఆగ‌స్టు 24న టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నం ప్రాంగ‌ణంలో శ్రీ‌నివాస క‌ల్యాణం     

ఆగ‌స్టు 24న టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నం ప్రాంగ‌ణంలో శ్రీ‌నివాస క‌ల్యాణం    

తిరుపతి, 2010 ఆగష్టు 17: శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తితిదే హిందూధర్మప్రచార పరిషత్‌ అధ్వర్యంలో ఈ నెల 24వ తేదిన తితిదే పరిపాలన భవనం వెనుక వైపున ఉన్న మైదానంలో శ్రీవారి కల్యాణం వైభవంగా జరుగుతుంది. పురప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శ్రీవారి కల్యాణాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము.

అదేవిధంగా ఈ నెల 24వ తేది శ్రావణ పౌర్ణమి రోజును పురస్కరించుకొని రాష్ట్రంలోని తితిదే కల్యాణమండపాలలో, చెన్నై, బెంగుళూరులలో శ్రీవారి కల్యాణాలు, రక్షాబంధన కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.