FLOAT FESTIVAL AT KARVETINAGARAM TEMPLE FROM AUGUST 28-30 _ ఆగస్టు 28 నుండి 30వ తేదీ వరకుకార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు
Tirupati, 20 August 2023: TTD is organising the annual float festival (Teppotsavam) at Sri Venugopal Swami Temple, Karvetinagaram from August 28-30.
As part of the three-day festivities, the artistes of HDPP and the Annamacharya project will render Harikatha, Bhakti sangeet and other cultural programs.
ఆగస్టు 28 నుండి 30వ తేదీ వరకుకార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు
తిరుపతి, 20 ఆగస్టు 2023: కార్వేటినగరం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
మొదటిరోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, రెండు, మూడవ రోజుల్లో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారికి ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.