VINAYAKA CHAVITI FETIVITIES BY TTD _ ఆగస్టు 31న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి వేడుకలు
TIRUPATI, 30 AUGUST 2022: In view of Vinayaka Chaviti on August 31, there will be special pujas in the TTD-run Sri Kapileswara Swamy temple and also in the Second Ghat Road Vinayaka temple on Wednesday.
In the evening, the processional deity of Sri Vinayaka will take a celestial ride on Mooshika Vahanam as part of the festivities in Sri Kapilwaswara Swamy temple.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 31న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి వేడుకలు
తిరుపతి, 2022 ఆగస్టు 30: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో ఆగస్టు 31న బుధవారం వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయక స్వామివారి మూలవర్లకు అభిషేకం, అర్చన చేపడతారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వినాయకస్వామివారికి మూషికవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు.
రెండో ఘాట్ రోడ్డులోని ఆలయంలో…
రెండో ఘాట్ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉదయం 8 నుండి 9 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.