E-AUCTION OF MOBILE PHONES ON AUGUST 4 AND AUGUST 5 _ ఆగష్టు 04 – 05 తేదీల్లో ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్లు ఈ – వేలం

Tirupati, 23 July 2025: Mobile phones donated by devotees in the Srivari Hundi at the Tirumala Sri Venkateswara Swamy Temple and other associated temples will be placed for e-auction on August 4 and 5 through the Andhra Pradesh State Government e-Procurement Portal.

The e-Auction includes mobile phones from various brands such as iPhone, Vivo, Nokia, LYF, Philips, Celkon, Micromax, Realme, Huawei, Tecno, Motorola, Karbonn, Samsung, and Oppo.

A total of 73 lots comprising new, used, and partially damaged mobile phones will be auctioned online.

For More Information:

Interested parties may contact the TTD Marketing Office, Tirupati at 0877-2264429 during office hours. Further details can also be accessed via TTD official website www.tirumala.org or the AP Government Procurement Portal www.konugolu.ap.gov.in

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగష్టు 04 – 05 తేదీల్లో ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్లు ఈ – వేలం

తిరుపతి, 2025, జూలై 23: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్న (73) లాట్ల మొబైల్ ఫోన్లను ఆగష్టు 04వ తేదీ నుండి 05వ తేదీ వరకు టిటిడిలో ఆన్ లైన్ ద్వారా ఈ వేలం (ఆన్ లైన్) వేయనున్నారు. వీటిలో కార్భన్, ఎల్ వై ఎఫ్, నోకియా, శాంసంగ్, లావా, ఐటెల్, లెనోవా, ఫిలిప్స్, ఎల్.జి.సాంసుయ్, ఒప్పో, పోకో, ఏసర్, పానా సోనిక్, హానర్, వన్ ప్లస్, బ్లాక్ బెర్రీ, జియోనీ, మైక్రో సాఫ్ట్ , ఆసస్ , కూల్ పాడ్, హెచ్.టి.సి, మోటోరోలా, టెక్నో, ఇంఫినిక్స్, రియల్ మీ, హువాయ్, సెల్కన్, వినో, మైక్రో మాక్స్ మరియు ఇతర మొబైల్ ఫోన్లు EA ID Nos. 25180, 25181, 25182, 25183 ఆన్ లైన్ లో ఈ వేలం వేయనున్నారు.

ఆసక్తి కల్గిన బిడ్డర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు వేలంలో పాల్గొనడానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ ( వేలములు) / ఏఈవో ( వేలములు), టిటిడి, హరేకృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu.ap.gov.in లేదా టిటిడి వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 – 2264429 ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించగలరు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది