ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు శ్రీ వ్యాసతత్వతీర్థుల ఆరాధన

ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు శ్రీ వ్యాసతత్వతీర్థుల ఆరాధన

తిరుపతి, 2012 ఆగస్టు 8: తితిదే దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల్‌ తాలూకాలోని శ్రీ వేణిసోమాపురంలో ఆగస్టు 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ వ్యాసతత్వ తీర్థుల ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆధ్యాత్మిక ధార్మిక ఉపన్యాసాలు, భక్తి సంగీత కార్యక్రమాలు, భజనలు చేపట్టనున్నారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు దాససాహిత్య ప్రాజెక్టు విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ పండితుల ఆరాధనా ఉత్సవాలు, గోష్టిసంకీర్తనమాల తదితర కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.