TEPPOTSAVAMS IN KARVETINAGARAM _ ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు
TIRUPATI, 06 AUGUST 2022: The annual Teppotsavams in Sri Venugopala Swamy temple at Karvetinagaram from August 9-11.
Everyday there will be Snapana Tirumanjanam, Tiruveedhi Utsavam and HDPP programmes arranged by TTD during this period.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు
ఆగస్టు 06, తిరుపతి, 2022: కార్వేటినగరంలోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఆలయం వద్ద పుష్కరిణి అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా తెప్పలపై విహారానికి బదులు ఆలయ మాడ వీధుల్లో స్వామి, అమ్మవార్లు విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
ఇందులో భాగంగా మొదటి రోజు ఆగస్టు 9న శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, రెండో రోజు ఆగస్టు 10, 11వ తేదీల్లో శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు ఊరేగింపుగా ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.