NARAYANAVANAM TEMPLE BRAHMOTSAVAM FROM AUGUST 24- SEPTEMBER 10 _ ఆగ‌స్టు 24 నుండి సెప్టెంబ‌ర్ 10వ తేదీ వరకు శ్రీ ఆవనాక్షి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 23 August 2021: TTD is organizing the annual Brahmotsavam of Sri Avanakshi Ammavari temple at Narayanavanam in Ekantham due to Covid guidelines from August 24 to September 10.

The highlights of the celebrations include Abhisekam, Samarpana, Kankana Dharana on August 24. Special Abisekam to Mula virat of Amnakshi (Avanakshi) Ammavaru is on August 31.

Thereafter Tiruchi utsavam shall be observed inside the temple from September 8-10 in the evening.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 24 నుండి సెప్టెంబ‌ర్ 10వ తేదీ వరకు శ్రీ ఆవనాక్షి  అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
 
తిరుపతి, 2021 ఆగ‌స్టు 23: నారాయణవనం శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అవనాక్షి  అమ్మవారి ఆలయంలో ఆగ‌స్టు 24 నుండి సెప్టెంబ‌రు 10 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు  జరుగనున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.
 
ఆగ‌స్టు 24న సాయంత్రం 5 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మవారికి అభిషేకం, స‌మ‌ర్ప‌ణ‌, కంక‌ణ ధార‌ణ నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 31న ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు అమ్మ‌వారి మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం చేప‌డ‌తారు. సెప్టెంబ‌రు  8 నుండి 10వ తేదీ వ‌ర‌కు సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాకారంలో తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.