ANNAMACHARYA PROPAGATED SOCIAL CONSCIOUSNESS COMBINED WITH SPIRITUALITY _ ఆధ్యాత్మికతతో సామాజిక స్పృహ : శ్రీ చిన‌వీర‌భద్రుడు

Tirupati, 28 May 2024: Retired IAS officer Sri Chinnaveerabhadrudu said that Annamayya used his Sankeertans as a weapon to raise social consciousness through spiritual means, thereby teaching the philosophy of God to the common people.  

As part of the 616th birth anniversary celebrations of Sri Thallapaka Annamacharya, the literary conference was held at the Annamacharya Kalamandiram in Tirupati on Tuesday.

The retired IAS who presided over the conference gave a lecture on “Annamayya – Arsha Samskriti”.  Annamayya suggested solutions in the way of singing to improve the social and political conditions about six centuries ago.  Through his Sankeertans, Annamayya said that everyone irrespective of their social status will get salvation if they serve Lord Sri Venkateswara Swamy with devotion. 

Anantapur SK University retired professor Dr.  Raghunadha Sharma speaking on the topic “Annamayya – Bhakti Tattvam” said that Bhakti is like a bridge to reach God and Annamayya wrote extensively about Bhakti in his Sankeertans.  

Retired Professor from Visakhapatnam Dr.  Indira speaking on the topic “Annamaya – Hanumat Sankeertanalu”, said that in Sri Vaishnava temples there is Garudalwar near the Lord and Sri Anjaneyaswamy outside the temple.  It is said that Annamayya visited many Hanuman temples in Rayalaseema and Karnataka and wrote several Sankeertans. 

Earlier at 9 am a devotional music program was conducted by Srimati Sai Padmaja troupe from Tirupati.  

Later Annamacharya Project Director Dr. Vibhishana Sharma felicitated the speakers with shawl and Srivari Tirtha Prasadams.  

SVETA Director Sri Bhumana Subramanyam Reddy, Sub Editor Dr  Narasimhacharyulu, Program Assistant Smt. Kokila, other officials and people of the temple city participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆధ్యాత్మికతతో సామాజిక స్పృహ : శ్రీ చిన‌వీర‌భద్రుడు

తిరుపతి, 2024 మే 28: ఆధ్యాత్మిక మార్గం ద్వారా సామాజిక స్పృహ పెంచేందుకు అన్నమయ్య త‌న కీర్త‌న‌లను ఒక ఆయుధంగా మ‌లుచుకున్నార‌ని, త‌ద్వారా సామాన్య ప్ర‌జ‌ల‌కు భగవంతుని తత్త్వాన్ని బోదించార‌ని విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ చిన‌వీర‌భద్రుడు పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు మంగ‌ళ‌వారం ఐద‌వ‌ రోజుకు చేరుకున్నాయి.

సదస్సుకు అధ్యక్షత వహించిన శ్రీ చిన‌వీరభద్రుడు ”అన్నమయ్య – ఆర్ష సంస్కృతి” అనే అంశంపై ఉపన్యసించారు. ఆరు శ‌తాబ్థాల‌కు పూర్వం ఉన్న‌ సామాజిక, రాజకీయ ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ద‌డానికి అన్న‌మ‌య్య‌ గాన‌ మార్గంలో ప‌రిష్క‌ర‌ణ‌ల‌ను సూచించార‌న్నారు. శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని భ‌క్తితో సేవిస్తే రాజులైన‌, ప్రజలైన‌ మోక్షం పొందుతార‌ని అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా ప్రజలలోకి తీసుకువెళ్లారని తెలిపారు. అన్న‌మ‌య్య ఆనాడు సూచించిన భ‌క్తి మార్గం నేటికి ఆచ‌ర‌ణీయ‌మ‌ని, ఆద‌ర్శ‌మ‌న్నారు. శ్రీ‌వారి సేవ‌కు తన కుటుంబాన్ని అంకితం చేసి, శ‌తాబ్ధాలు గ‌డిచిన‌ చెక్కు చెదరక ఆద‌ర్శంగా అన్న‌మ‌య్య నిలిచారని వివరించారు.

అనంతపురం ఎస్‌కె యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు డా. రఘునాధ శర్మ ” అన్నమయ్య – భక్తి త‌త్త్వాం ” అనే అంశంపై మాట్లాడుతూ, భక్తి అనేది భగవంతుని చేరుకోవడానికి వారధి వంటిద‌ని, అన్నమయ్య సంకీర్తనలలో భక్తిని గురించి చాలా విస్తృతంగా రాశార‌న్నారు. శ్రీనివాసుడు ఎంతటి మహిమ గల దేవుడో అన్నమయ్య అంతటి విశిష్టమైన భక్తుడన్నారు. వేదాంతాన్ని భక్తి అనే రసగుళిక ద్వారా సామాన్యప్రజలకు చేరువ చేసిన మహనీయుడు అన్నమయ్య అన్నారు. భగవంతుని చేరేందుకు భక్తి సులభమైన మార్గమని చెప్పారు.

విశాఖపట్నంకు చెందిన విశ్రాంత ఆచార్యులు డా. ఇందిర ” అన్నమయ్య – హనుమ‌త్సంకీర్తనలు ” అనే అంశంపై ప్రసంగిస్తూ, శ్రీ వైష్ణ‌వ ఆల‌యాల్లో స్వామికి ద‌గ్గ‌ర‌గా గ‌రుడాళ్వార్‌, ఆల‌యానికి బ‌య‌ట శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారు ఉంటార‌న్నారు. రాయలసీమ, కర్ణాటకలోని పలు హ‌నుమ‌త్ ఆల‌యాలను అన్నమయ్య సందర్శించి కీర్తనలు రచించారని తెలిపారు. ఇప్పటివరకు లభించిన 14 వేల‌ అన్నమయ్య సంకీర్తనలలో 55 హనుమత్సంకీర్తనలు ఉన్నట్లు తెలిపారు. ప్రతి కీర్తనలో హనుమంతుని యొక్క గొప్పతనాన్ని వర్ణించారని, ఆయ‌న‌ చిన్నతనం నుండి చిరంజీవి అయ్యేవరకు వర్ణించినట్లు చెప్పారు.

అంత‌కుముందు ఉద‌యం 9 గంట‌లకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి సాయిప‌ద్మ‌జ బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

అనంత‌రం అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్ డా||విభీష‌ణ శ‌ర్మ వ‌క్త‌ల‌ను శాలువ, శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాల‌తో స‌త్క‌రించారు.

ఈ కార్యక్రమంలో శ్వేత సంచాల‌కులు శ్రీ భూమ‌న సుబ్ర‌మ‌ణ్యం రెడ్డి, ఉప సంపాదకులు డా|| నరసింహాచార్యులు, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీ‌మ‌తి కోకిల‌, ఇతర అధికారులు, పుర ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

t