AYURVEDA SHOULD GUIDE THE WORLD _ ఆయుర్వేదం ప్రపంచానికి దిక్సూచిగా మారాలి-జేఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

EFFORTS TO SET UP AYURVEDA UNIVERSITY

Tirupati,11 December 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi called upon Ayurveda doctors to emerge as a vanguard in Ayurvedic Medicine with extensive research and development.

Inaugurating the CME training program under the Ayush ministry held at the SV Ayurveda College in Tirupati on Monday, the JEO said upon the directions of TTD Chairman Sri Bhumana Karunakara Reddy and EO Sri AV Dharma Reddy the training camp is being held till December 16 wherein 12 eminent ayurvedic experts conduct sessions for Ayurveda students and practitioners from viz. AP, TS, TN, Rajasthan, Gujrat, Tripura and Maharashtra are also participating.

She exhorted for utilising ancient knowledge of Ayurveda adapted to modern technology with innovations for upgrading Indian supremacy in the health sector. The Vedas are embedded with Ayurvedic medical knowledge whose amalgamation with modern technology and research will help the society, she asserted.

She said TTD is making all efforts to establish an Ayurvedic University for the benefit of students, researchers and experts in South India.

CAuO Sri Sesha Shailendra said the Pancha Karma treatment which costs around ₹1.5 lakhs in private hospitals is being provided free of cost in SV Ayurveda Hospital and the SV Ayurveda pharmacy has already introduced two major products and many more are in the offing.

SV Physiotherapy College Principal Dr Madhavi Lata, SV Ayurvedic College Principal Dr Renu Dixit highlighted the research work and Dhanwantari programs promoted by TTD institution.

DEO Dr Bhaskar Reddy, Ayurveda College Nodal Officer Dr Vijay Bhaskar Reddy, faculty and students of the Ayurveda college were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆయుర్వేదం ప్రపంచానికి దిక్సూచిగా మారాలి

– ఆయుర్వేద విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటుకు కృషి

– జేఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుపతి, 2023 డిసెంబర్ 11: ఆయుర్వేద వైద్యులు ప్రణాళికాబద్ధంగా పరిశోధనలు చేసి ప్రపంచానికి దిక్సూచిగా మారాలని టీటీడీ జేఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి (విద్య‌, వైద్య‌) ఆకాంక్షించారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం సిఎంఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్నికి ముఖ్య అతిధిగా జేఈవో ప్రారంభించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆదేశాల మేర‌కు క‌ళాశాల‌లో డిసెంబ‌రు 16వ తేదీ వ‌ర‌కు సిఎంఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందులో 12 మంది ప్ర‌ముఖ వైద్య నిపుణుల‌తో పాటు, ఆంధ్ర‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, త్రిపుర, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, మ‌హారాష్ట్ర వంటి దాదాపు 10 రాష్ట్రాల‌కు చెందిన ఆయుర్వేద వైద్యులు, ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొంటున్న‌ట్లు చెప్పారు.

పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆయుర్వేదం చికిత్సా పద్ధతులను, సూత్రాలను పరిశీలించి నూతన ఆవిష్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని చెప్పాలన్నారు. విద్యార్థులు అంకితభావంతో, త్రికరణశుద్ధిగా కృషిచేసి ఆయుర్వేదాన్ని అర్థం చేసుకోవాలన్నారు. మ‌న పూర్వీకులు మ‌న‌కు అందించిన వేదాల‌లో ఆయుర్వేదం అపూర్వ‌మైంద‌న్నారు. అనేక ప్రాచీన అంశాలను ఆధునిక శాస్త్రంతో సమన్వయం చేసి, మంత్రార్థాలు వాటి వివరణను తెలియజేశార‌న్నారు. వేద అంశాలపై వివిధ శాస్త్రాలకు సంబంధించిన వారు పరిశోధన చేయడం వల్ల ఆధునిక సమాజానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ద‌క్షిణ భార‌త దేశంలో టీటీడీ ఆద్వ‌ర్యంలో ఆయుర్వేద విశ్వ‌విద్వాల‌యం ఏర్పాటుకు కృషి చేస్తామ‌న్నారు.

టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫిస‌ర్‌ శ్రీ శేషశైలేంద్ర మాట్లాడుతూ, పంచకర్మ చికిత్సకు బ‌య‌ట ఆసుప‌త్రుల్లో దాదాపు రూ.1.5 ల‌క్ష‌లు అవుతుంద‌ని, ఎస్వీ వైద్యశాలలో పంచకర్మ చికిత్స ఉచితంగా అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఎస్వీ ఆయుర్వేద ఫార్మ‌సి నుండి ఇప్ప‌టికే రెండు ఉత్ప‌త్తులు రోగుల‌కు టీటీడీ అందుబాటులోనికి తీసుకువ‌చ్చింద‌ని, త్వ‌ర‌లో మ‌రిన్ని ఆయుర్వేద‌ ఔష‌దాలు ఎస్వీ ఆయుర్వేద ఫార్మాసీ నుండి అందుబాటులోనికి తోసుకురాన‌న్న‌ట్లు వివ‌రించారు.

ఎస్వీ పిజియో థెర‌పి కాలేజి ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ మాధ‌వీ ల‌త మాట్లాడుతూ, గ‌త 30 సంవ‌త్స‌రాలుగా ఆయుర్వేద క‌ళాశాల ఎంత‌గానో అభివృద్ది చెందిన‌ట్లు తెలిపారు. ఆయుర్వేదం ద్వారా సమాజానికి విశిష్ట వైద్య సేవలు అందించే అవకాశం ఉందని వివ‌రించారు.

క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ రేణుదీక్షిత్ మాట్లాడుతూ, భార‌త‌దేశ స‌మ‌గ్రాభివృద్ధికి ఆయుర్వేదం ఎలా తోడ్ప‌డుతుందో తెలియ‌జేశారు. ధ‌న్వంత‌రి ఆవిర్భావం, జాతీయ ఆయుర్వేద దినోత్స‌వం మొద‌లైన కార్య‌క్ర‌మాల‌ను క‌ళాశాల‌లో నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఇలాంటి కార్య‌క్ర‌మాల ద్వారా విద్వార్థుల‌కు ఆయుర్వేదంలో నూత‌న ప‌రిశోద‌న‌లు, ఆవిష్క‌ర‌ణలు తెలుస్తాయ‌ని వివ‌రించారు.

ఈ కార్యక్రమంలో డిఈవో శ్రీ భాస్క‌ర్ రెడ్డి, ఆయుర్వేద కళాశాల నోడ‌ల్ అధికారి డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.