CREATE AWARENESS ON HEALTHY AYUR FOOD PRODUCTS AMONG MASSES-DR MURALIKRISHNA _ ఆయుర్వేద పోష‌కాహారంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి

TIRUPATI, 02 OCTOBER 2021: In the present scenario, people should be enlightened on the benefits of healthy food products as mentioned in Ayurvedic texts to develop immunity to overcome dreadful viruses and diseases, said Dr Muralikrishna, the Principal SV Ayurvedic College.

On the occasion of Bhagavan Dhanwantari Jayanthi, the sixth Ayurvedic Anniversary was held n the college premises.

Speaking on the occasion, the Principal said the school students should also be educated and informed on the richness of Ayurvedic food habits.

RMO of SV Ayurvedic Hospital Dr G Padmavathi, Prof. Venkatasivudu, Dr Bhaskar Rao, Prof. Lakshmana Prasad also spoke on the occasion.

Earlier Abhishekam and Homams were performed in the college and later the students who stood in first and second places in the Sanskrit Ayurvedic Shlokas competition were awarded with a cash prize of Rs. 5000 and Rs. 3000 respectively.

College faculty and students, Hospital staffs were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆయుర్వేద పోష‌కాహారంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి

– జాతీయ ఆయుర్వేద దినోత్స‌వ స‌ద‌స్సులో ఆయుర్వేద క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ

తిరుపతి, 2021 నవంబరు 02: ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆయుర్వేద గ్రంథాల్లోని పోష‌కాహారం, వాటి వ‌ల్ల క‌లిగే ఉపయోగాల గురించి ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే రీతిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ చెప్పారు. భ‌గ‌వాన్ ధ‌న్వంత‌రి జ‌యంతి సంద‌ర్భంగా 6వ జాతీయ ఆయుర్వేద దినోత్స‌వాన్ని మంగ‌ళ‌వారం తిరుప‌తిలోని ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆయుర్వేదం – స‌మ‌గ్ర పోష‌కాహారం అనే అంశంపై స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పాఠ‌శాల‌, క‌ళాశాల విద్యార్థుల‌కు కూడా ఆయుర్వేద పోష‌కాహారం గురించి అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు.

ప్ర‌త్యేక అతిథిగా హాజ‌రైన ఆయుర్వేద ఆసుప‌త్రి ఆర్ఎంవో డాక్ట‌ర్ జి. ప‌ద్మావ‌తి మాట్లాడుతూ అధ్యాప‌కుల నుంచి విద్యార్థులు జ్ఞాన‌స‌ముపార్జ‌న చేసుకోవడానికి ప్ర‌య‌త్నించాల‌ని, అందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని చెప్పారు.

ప్రొఫెస‌ర్‌ వెంక‌ట‌శివుడు మాట్లాడుతూ ధ‌న్వంత‌రి ఆవిర్భావం, జాతీయ ఆయుర్వేద దినోత్స‌వం, ధ‌న్వంత‌రి ఆల‌యాలు – వాటి వైశిష్ట్యం మొద‌లైన అంశాల‌ను వివ‌రించారు.

క‌ళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ సుంద‌రం మాట్లాడుతూ విభిన్న ఆహారాలు, ఆహారానికి సంబంధించిన స‌మ‌య నిర్దేశ‌కాలు, వ్యాధులు, ఆహార విష‌యాల్లో ప‌త్యం, శుద్ధ ఆహారానికి సంబంధించిన విష‌యాల‌ను వివ‌రించారు.

అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ భాస్క‌ర్‌రావు మాట్లాడుతూ భార‌త‌దేశ స‌మ‌గ్రాభివృద్ధికి ఆయుర్వేదం ఎలా తోడ్ప‌డుతుంద‌నే విష‌యాన్ని తెలియ‌జేశారు.

ప్రొఫెస‌ర్‌ ల‌క్ష్మ‌ణ‌ప్ర‌సాద్ పంచ‌క‌ర్మ చికిత్సా విధానాల‌ను, డాక్ట‌ర్ ప‌ద్మ‌జ పోష‌ణ‌ను ప్ర‌భావితం చేసే ఆయుర్వేద అంశాలు అనే విష‌యాల‌ను, డాక్ట‌ర్ రాగ‌మాల ఆయుర్వేద శాస్త్రంలో పిల్ల‌ల పోష‌ణ – గ‌ర్భిణుల ఆహార నియ‌మాలు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ స్వ‌ర్ణ‌ల‌త విభిన్న వ‌య‌సుల‌కు అనుగుణంగా స్త్రీల పోష‌ణ అనే అంశాలపై ప్ర‌సంగించారు.

అంత‌కుముందు క‌ళాశాల ఆవ‌ర‌ణంలోని శ్రీ ధ‌న్వంత‌రిమూర్తికి అభిషేకం, ప్ర‌త్యేక అలంక‌ర‌ణ చేసి ల‌క్ష్మీ ధ‌న్వంత‌రి హోమం, మ‌హాసుద‌ర్శన హోమం, న‌వ‌గ్ర‌హ హోమం నిర్వ‌హించారు.

అనంత‌రం కళాశాల విద్యార్థుల‌కు సంస్కృత ఆయుర్వేద శ్లోక కంఠ‌స్త పోటీలు, ఆయుర్వేద ప్రాధాన్య‌త, ఆయుర్వేద వైద్య‌శాస్త్రంలో స‌మ‌గ్ర పోష‌కాహారం అనే అంశాల‌పై పోస్ట‌ర్ ప్ర‌జంటేష‌న్ పోటీలు నిర్వ‌హించారు. ప్ర‌థ‌మ స్థానంలో నిలిచిన‌వారికి రూ.5 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.3 వేలు న‌గ‌దు బ‌హుమ‌తులు అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.