ఆయుర్వేద వైద్య అధ్యనంపై ముగిసిన టీటీడీ అధికారుల కేరళ పర్యటన
ఆయుర్వేద వైద్య అధ్యనంపై ముగిసిన టీటీడీ అధికారుల కేరళ పర్యటన
తిరుపతి 2 జూన్ 2023: ఆయుర్వేద వైద్యం పట్ల ప్రజల్లో ఆసక్తి కలిగించి, మెడికల్ టూరిజం అభివృద్ధి చేసే ఉద్దేశంతో టీటీడీ అధికారులు మూడు రోజుల పాటు కేరళలో జరిపిన పర్యటన గురువారం ముగిసింది.
జేఈవో శ్రీమతి సదా భార్గవి,సి ఏవో శ్రీ శేషశైలేంద్ర, ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ గురువారం సాయంత్రం తిరువనంతపురం సమీపంలోని కోవళం వద్ద గల సోమ తీరం ఆయుర్వేద గ్రామాన్ని సందర్శించారు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్న గుడిసెల తరహాలో నిర్మించిన ఇన్ పేషంట్ గదులను పరిశీలించారు. డాక్టర్లు, సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారు, వారి బాధ్యతల గురించి తెలుసుకున్నారు. ఫార్మసీ, పరిశోధన శాలను పరిశీలించి వాటి నిర్వహణ విధానాల గురించి తెలుసుకున్నారు. ఇక్కడ ఇన్ పేషంట్లకు వారి వ్యాధిని బట్టి ఆహారాన్ని ఇస్తున్న విధానం గురించి తెలుసుకున్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది