ACTION PLAN FOR VOLUNTARY BHAJANS IN ALL TTD TEMPLES-EO _ ఆల‌యాల్లో స్వ‌చ్ఛందంగా భ‌జ‌న‌లు ప్ర‌త్యేకంగా సాఫ్ట్‌వేర్‌ అప్లికేష‌న్ రూపొందించాలి -టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

TIRUMALA, 08 NOVEMBER 2021: TTD EO Dr KS Jawahar Reddy instructed the officials concerned to come out with a concrete action plan to conduct bhajans with devotees voluntarily in all TTD run temples apart from Tirumala.

During the senior officers review meeting held at TTD Administrative Building in Tirupati on Monday, the EO directed Dharmic Projects Officer Sri Vijaya Saradhi to chalk out an action plan to implement the same.

He also instructed the IT wing officials to prepare exclusive software to implement these Bhajan programmes at Tirumala and other places in a smooth manner. He also said, this will enable the Bhajan mandalis to participate in rendering devotional bhajans on a voluntary basis. “They shall also apply to perform in Nada Neerajanam platform”, he added.

The EO also said, the devotees residing in the agency and backward areas where TTD had constructed 502 temples, shall also be motivated to take part in the bhajans in their respective temples on a voluntary basis. The Bhajan materials shall be supplied by TTD”, he maintained. 

Later the EO also briefed that TTD is contemplating to hold Sri Venkateswara Puja in all the temples dedicated to Sri Venkateswara Swamy across the state on every Saturday along with Bhagavat Gita Parayanam. He also felt that the local temple organisers should take initiative in ensuring that the devotees take part in these bhajans in the temples of their respective localities on a voluntary basis. He also said, the devotees shall make use of this opportunity provided by TTD to enhance the devotional vibes in their home places.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, FACAO Sri Balaji and other senior officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆల‌యాల్లో స్వ‌చ్ఛందంగా భ‌జ‌న‌లు

ప్ర‌త్యేకంగా సాఫ్ట్‌వేర్‌ అప్లికేష‌న్ రూపొందించాలి

టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుమ‌ల‌, 2021 న‌వంబ‌రు 08: తిరుమ‌ల‌, ఇత‌ర ప్రాంతాల్లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల్లో స్వ‌చ్ఛందంగా భ‌జ‌న‌లు చేసేందుకు భ‌క్తుల‌కు అవ‌కాశం క‌ల్పించేందుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేయాల‌ని టిటిడి కార్య‌నిర్వ‌హ‌ణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ధార్మిక ప్రాజెక్టుల కార్య‌క్ర‌మాల అధికారిని ఆదేశించారు.

టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన సీనియ‌ర్ అధికారుల స‌మావేశంలో ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో స్వ‌చ్ఛందంగా జ‌ర‌గాల్సిన భ‌జ‌న కార్య‌క్ర‌మాలను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. భ‌జ‌న క‌ళాకారులు భ‌జ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు ఒక ప్ర‌త్యేక సాఫ్ట్‌వేర్‌ అప్లికేష‌న్ రూపొందించాల‌ని అధికారుల‌కు సూచించారు. త‌ద్వారా క‌ళాకారులు, భ‌జ‌న‌మండ‌ళ్ళ‌కు స్వ‌చ్ఛందంగా భ‌జ‌న‌లు చేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు. తిరుమ‌ల‌లో నాద‌నీరాజ‌నం వేదిక ద్వారా విరివిగా ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందేన‌న్నారు. నాద‌నీరాజ‌నం కార్య‌క్ర‌మాల్లో అవ‌కాశం రానివారు సైతం ఈ భ‌జ‌న కార్య‌క్ర‌మాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. టిటిడి నిధుల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 502 ఆల‌యాల‌ను మారుమూలన ఉన్న గిరిజ‌న‌, ఎస్‌సి, మ‌త్స్య‌కార ప్రాంతాల్లో నిర్మించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ ఆలయాల్లో అనునిత్యం భ‌జ‌న‌లు నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మ‌య్యే భ‌జ‌న సామ‌గ్రిని టిటిడి స‌మ‌కూరుస్తుంద‌ని తెలిపారు.

అంతేగాక రాష్ట్రంలోని అన్ని వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల్లో ప్ర‌తి శ‌నివారం శ్రీ వేంక‌టేశ్వ‌ర పూజా విధానం నిర్వ‌హించ‌డం, భ‌గ‌వ‌ద్గీత పారాయ‌ణం చేప‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్టు చెప్పారు. గ్రామాల్లోని దేవాల‌యాల్లో నిత్యం భ‌జ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే విష‌య‌మై స్థానిక ఆల‌య నిర్వాహ‌కులు తగిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. క‌నుక వివిధ ప్రాంతాల‌లో వున్న భ‌జ‌న‌మండ‌ళ్ళు, క‌ళాకారులు స్వ‌చ్ఛందంగా ఆల‌యాల‌లో భ‌జ‌న‌లు చేసేందుకు టిటిటి క‌ల్పిస్తున్న ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.