NO MISUSE OF ENGINEERING MATERIALS: TTD _ ఇంజినీరింగ్ సామ‌గ్రి దుర్వినియోగం కాలేదు : టిటిడి

Tirupati, 02 February 2022: TTD on Wednesday denied allegations made by CITU District Secretary Sri K Murali that unused Engineering materials lying in the engineering department were being misused.

In a statement released on Wednesday Engineering Wing officials stated that as part of the clean and green program some waste materials lying at water treatment plant like plastic boxes, plastic covers, boards, iron rods, and bits were shifted to solid waste management plant.

Similarly, the old and damaged sheets of the shelter above the tank were changed and old sheets were shifted to water treatment Plant near Outer Ring Road. Later the old sheets were used to build a temporary shed for materials storage as well, TTD clarified.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఇంజినీరింగ్ సామ‌గ్రి దుర్వినియోగం కాలేదు : టిటిడి

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 02: టిటిడి ఇంజినీరింగ్ విభాగంలో నిరుప‌యోగంగా ఉన్న ఇంజినీరింగ్ సామ‌గ్రి ఎలాంటి దుర్వినియోగం కాలేద‌ని, ఈ విష‌య‌మై సిఐటియు జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ కందార‌పు ముర‌ళి చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని టిటిడి తెలియ‌జేస్తోంది.

తిరుమలలో పరిశుభ్రత చర్యల్లో భాగంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్ దగ్గర పోగుప‌డిన‌ ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు, కప్ బోర్డులు, ఇనుప తీగలు, బిట్‌లను(వ్యర్థాలు) ఘనవ్యర్థాల ప్లాంట్‌కు తరలించడం జరిగింది. ఏరియేషన్ ట్యాంక్‌పై ఏర్పాటు చేసిన షెల్టర్ చాలా పాతది. షెల్టర్‌పై ఉన్న పాత పైకప్పు షీట్లు దెబ్బతిని ఇబ్బందికరంగా మారడంతో షెల్టర్‌ను కొత్త షీట్‌లతో పునరుద్ధరించి దెబ్బతిన్న షీట్‌లను ఔటర్ రింగ్ రోడ్డులోని పాచికాలువ సమీపంలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్ వద్దకు తరలించడం జరిగింది. అనంతరం ఆ షీట్లను సామగ్రి నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్‌కు ఉపయోగించడం జరిగింది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.