ఈనెల 12న శ్రీవేంకటేశ్వర ఎఫ్.ఎం స్టూడియో ప్రారంభం
ఈనెల 12న శ్రీవేంకటేశ్వర ఎఫ్.ఎం స్టూడియో ప్రారంభం
తిరుపతి, నవంబర్-10, 2009 : తిరుపతిలోని శ్రీఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఎఫ్.ఎం స్టూడియోను తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు ఈనెల 12వ తేది సాయంత్రం 4గంటలకు ప్రారంభిస్తారు.
ప్రజలలో చైతన్యం కలిగిస్తూ విద్యార్థులలోని ప్రతిభను వెలికితీస్తూ, ప్రజాసంబంధాలను బలోపేతం చేస్తూ, శ్రీవారి భక్తితత్వాన్ని విసృతపరుస్తున్న శ్రీవేంకటేశ్వర ఎఫ్.ఎం కమ్యూనిటి రేడియోను ఆధునీకరించాలని తితిదే నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో 2007 ఫిబ్రవరి 8వ తేదిన తితిదే శ్రీవేంకటేశ్వర ఎఫ్.ఎం రేడియో కమ్యూనికేషన్‌ను నెలకొల్పారు. ఇక అప్పటి నుంచి శ్రీవారి భక్తితత్వాన్ని 904 మెగా హెడ్స్‌పై ప్రచారం చేస్తూ భక్తుల మన్నలను పొందుతున్నది. ప్రజలకు మరింత చేరువ చేయడానికి తితిదే ఈ ఎఫ్.ఎంను తిరుమల నుంచి తిరుపతికి మార్చి ఎస్.వి. ఓరియంటల్ కళాశాలకు అనుబంధం చేసింది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ ప్రచారాలను కొనసాగిస్తున్నది. ఇందులో ముఖ్యంగా హిందూ ధర్మప్రత్యేకతను, శ్రీవారి మహియతత్వాన్ని, తిరుమల విశిష్ఠతను ప్రచారం చేస్తూ భక్తుల ప్రశంసలను అందుకొంటున్నది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.