ఈనెల 26వ తేది నుండి 30వ తేది వరకు తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు

ఈనెల 26వ తేది నుండి 30వ తేది వరకు తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు

తిరుపతి, డిశెంబర్‌-18, 2009: తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 26వ తేది నుండి 30వ తేది వరకు తెప్పోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి.

5 రోజుల పాటు జరిగే ఈతెప్పోత్సవాలలో మొదటిరోజు శ్రీవినాయకస్వామివారు పుస్కరిణిలో విహరిస్తారు. రెండవ రోజు శ్రీసుబ్రమణ్యస్వామి, మూడవరోజు శ్రీసోమస్కందస్వామివారు, నాల్గవ రోజు శ్రీకామక్షి అమ్మవారు, ఐదవరోజు శ్రీ చెండికేశ్వరస్వామివారు మరియు శ్రీ చంథ్రేఖర స్వాములవారు పుస్కరిణిలో తెప్పలపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.

ఈ తెప్పోత్సవాల సందర్భంగా శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వుంటాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.