ఈనెల 30వ తేదిన మంగళ కైశికద్వాదశి అస్థాన మహోత్సవం

ఈనెల 30వ తేదిన మంగళ కైశికద్వాదశి అస్థాన మహోత్సవం

తిరుమల, అక్టోబర్‌-29, 2009: ఈనెల 30వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక మంగళ కైశికద్వాదశి అస్థాన మహోత్సవం ఘనంగా జరుగుతుంది.

ఈ సందర్భంగా 30వ తేది ఉదయం 4.30 గంటలకు శ్రీఉగ్రశ్రీనివాసమూర్తి, ఉభయనాంచారులను తిరుమాఢవీధులలో ఊరేగిస్తారు. ఉదయం 5.30 గంటలకు శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి అస్థానం నిర్వహిస్తారు.

వరాహపురాణంలో ‘ఆముక్తమాల్యద’లో ప్రస్తావించబడిన స్ఫూర్తిమంతమైన ఒక ‘దాసవైభవ’ కథాంశం ఇది. తన ముగ్దమనోహర మంగళకౌశిక రాగాలాపానతో ఆ వేళ ‘మాలదాసరి’ భగవంతుడైన శ్రీవారిని మెప్పించడం, ఆపుణ్యాన్ని ఒక బ్రహ్మరాక్షసుడికి ధోరవోస్తూ, వానికి శాప విముక్తి కల్గించడం ఇందలి విశేషం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.