SRI LAKSHMINARAYANA IS OMNI PRESENT -JIYAR _ ఈ విశ్వం ల‌క్ష్మీనారాయ‌ణుల స్వ‌రూపం: శ్రీ‌శ్రీ‌శ్రీ రామానుజ సంప‌త్కుమార జీయ‌ర్‌స్వామి

Tiruchanoor, 26 Nov. 19: Sri Sri Sri Ramanuja Sampatkumara Jiyar Swamy, the Pontiff of Tridandi Astakshari Peetham of Vijayawada said that the entire planet is filled with the Divine presence of Sri Lakshmi Narayana.

He was presenting his key address on Vishnu Paramyam in Vedas organised as a part of Goddess Padmavati Devi Brahmotsavams at the Asthana mandapam of Tiruchanoor under the aegis of SV institute of Higher Vedic studies on Tuesday.

He lauded the services of TTD in protection,  propagation and preservation of the Vedas through the SVIHVS.

Earlier the Vedic students rendered Chaturveda Parayanam

TTD Pancharatra Agama advisor Sri Kanduri Srinivasacharyulu, Dr Akella Vibhishana Sharma of SVIHVS and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI 

ఈ విశ్వం ల‌క్ష్మీనారాయ‌ణుల స్వ‌రూపం : శ్రీ‌శ్రీ‌శ్రీ రామానుజ సంప‌త్కుమార జీయ‌ర్‌స్వామి

తిరుపతి, 2019 న‌వంబ‌రు 26: స‌క‌ల‌జీవ‌రాశుల‌తో కూడిన ఈ విశ్వం ల‌క్ష్మీ నారాయ‌ణుల స్వ‌రూప‌మ‌ని, జ‌గ‌త్తు మొత్తం స్వామి, అమ్మ‌వార్లు నిండి ఉన్నార‌ని విజ‌య‌వాడ‌లోని త్రిదండి అష్టాక్ష‌రీ పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ రామానుజ సంప‌త్కుమార జీయ‌ర్‌స్వామి ఉద్ఘాటించారు. అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని టిటిడి ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో తిరుచానూరులోని ఆస్థాన మండ‌పంలో ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ప్ర‌ముఖ స్వామీజీల అనుగ్ర‌హ భాష‌ణం నిర్వ‌హిస్తున్నారు.

ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం శ్రీ‌శ్రీ‌శ్రీ రామానుజ సంప‌త్కుమార జీయ‌ర్‌స్వామి “వేదాల‌లో విష్ణుపార‌మ్యం” అనే అంశంపై అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. ల‌క్ష్మీదేవి కోరిక మేర‌కే శ్రీ‌మ‌హావిష్ణువు ఈ సృష్టిని చేశాడ‌ని వేదాలు చెబుతున్నాయ‌న్నారు. ప్రాణికోటిని అనుగ్ర‌హించి ద‌య‌చూపాల‌ని అమ్మ‌వారు స్వామివారిని ప్రార్థిస్తుంద‌న్నారు. మాన‌వుల క‌ర్మాచ‌ర‌ణ‌ను బ‌ట్టి ప‌ర‌మాత్ముడు త‌గిన ఫ‌లితాన్ని ఇస్తాడ‌ని చెప్పారు. ల‌క్ష్మీ శ్రీ‌నివాసుల‌ను ఆరాధిస్తే త‌ప్ప‌క మోక్షం సిద్ధిస్తుంద‌న్నారు. టిటిడి ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ త‌ర‌ఫున వేద ప‌రిర‌క్ష‌ణ‌, ప్ర‌చారం చ‌క్క‌గా చేస్తున్నార‌ని ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ను అభినందించారు. అంత‌కుముందు వేద‌పండితులు చ‌తుర్వేద పారాయ‌ణం చేశారు. ఈ సంద‌ర్భంగా స్వామీజీని శాలువ‌, శ్రీవారి ప్ర‌సాదంతో స‌త్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ కాండూరి శ్రీ‌నివాసాచార్యులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, ఎస్వీ వేద వ‌ర్సిటీ ఆచార్యులు శ్రీ పురుషోత్త‌మాచార్యులు, శ్రీ కృష్ణ ఘ‌నాపాఠి, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు ఆచార్య సంప‌త్‌కుమారాచార్యులు, ఆచార్య రాఘ‌వాచార్యులు, ప‌లువురు వేద‌పండితులు, అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.