JEO(H&E) LAUDS PUPILS WHO ACHIEVED HIGH SCORES IN INTER _ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జేఈవో అభినందనలు
TIRUPATI, 05 MAY 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi on Friday lauded the students of various TTD-run Junior Colleges for having scored the highest marks in the Inter.
The students of both first and second-year Intermediate from SV Junior and SP Junior colleges met the JEO in her chambers TTD Administrative Building.
The JEO, while appreciating, advised the students also to prepare for the competitive exams and gave them the books. She also lauded the Principals and lecturers of both the colleges for guiding the students in a proper way to achieve high scores and instructed them to continue the same spirit and chalk out an academic action plan for training the pupils.
Parents thanks TTD
The parents of the students who scored highest marks expressed their gratitude to TTD and especially to JEO Smt Sada Bhargavi for having shown keen interest in improving the quality of education in all the TTD educational institutions and DEO Sri Bhaskar Reddy for properly executing the instructions of JEO to achieve good results.
Along with the DEO, SP Junior College Principal Smt Bhuvaneshwari, SV Junior College Principal Sri Prakash Babu were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జేఈవో అభినందనలు
తిరుపతి 5 మే 2023: శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాల,శ్రీపద్మావతి బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను జేఈవో శ్రీమతి సదా భార్గవి శుక్రవారం అభినందించారు.
ఇంటర్మీడియేట్ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కళాశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి జేఈవో శ్రీమతి సదా భార్గవి నేతృత్వంలో, డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో అనేక చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం, వారిని చదివించడం పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. ఈ సందర్బంగా అధ్యాపకులు,విద్యార్థులను జేఈవో తన చాంబర్లో అభినందించారు. ఈ విద్యా సంవత్సరంలో మరింత ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఇప్పటి నుండే ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని అధ్యాపకులకు జేఈవో సూచించారు. పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులు రాణించాలని ఆశీర్వదించి, ఇందుకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు.
విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, టీటీడీ యాజమాన్యం, కళాశాలల అధ్యాపకులు తమ పిల్లలకు మంచి సదుపాయాలు కల్పించి ఉత్తమ విద్యాబోధన చేయడం వల్లే మంచి మార్కులు సాధించగలిగారని సంతోషం వ్యక్తం చేశారు.
డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి, శ్రీపద్మావతి బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి భువనేశ్వరి, ఎస్వీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ప్రకాష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది