EMPLOYEES WELFARE IS MY VISION- TTD CHAIRMAN _ ఉద్యోగులందరికీ మంచి చేయాలన్నదే నా తపన-⁠ ⁠టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి

PRIORITY TO EMPOWER SUBORDINATE STAFF –  TTD CHAIRMAN

GRAND FACILITATION BY TTD EMPLOYEES

Tirupati, 23 February 2024: TTD Chairman Sri Bhumana Karunakar Reddy reiterated that his vision is at empowering subordinate staff. 

He was addressing the facilitation program organised by TTD workforce including the regular, contract and outsourcing employees in the Parade Grounds of TTD administrative building on Friday evening. 

Vedic pandits of Srivari temple offered Veda Ashirvarvachanam to him on the occasion. 

Speaking on the occasion he said with the assurance of the Honourable CM of AP and with the benign blessings of Sri Venkateswara that he has become the Chairman of TTD for the second time to serve employees and devotees. 

Speaking on the occasion earlier JEO Sri Veerabrahmam said chairman initiative to get house sites and regularisation of contract employees were commendable. 

TTD CPRO Dr T Ravi said the Chairman had fruitified 30 years dreams of employees.

Thereafter senior officials of the welfare Association, Srivari temple employees, ugranam, Vahanam bearers, printing, sales wing, PR department, transport staff etc presented shawls and felicitated Chairman with Gaja Mala.

The Employees Unions leaders thanked the Chairman for his generosity and keeping up his word by pouring laurels.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఉద్యోగులందరికీ మంచి చేయాలన్నదే నా తపన

•⁠ ⁠కిందిస్థాయి సిబ్బందికి మేలు చేయడమే నా ప్రాధాన్యత

•⁠ ⁠టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి

•⁠ ⁠టీటీడీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సన్మానం

తిరుపతి, 23 ఫిబ్రవరి 2024: ఉద్యోగులందరికీ మంచి చేయాలన్నదే నా తపన అని, శ్రీవారు తనకు ఇచ్చిన అవకాశాన్ని ధర్మప్రచారంతోపాటు కిందిస్థాయి సిబ్బందికి మేలు చేయడానికే వినియోగిస్తున్నానని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి తెలియజేశారు. టీటీడీ రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో శ్రీ భూమన కరుణాకరరెడ్డికి కృతజ్ఞతాసభ, ఆత్మీయ సన్మాన కార్యక్రమం శుక్రవారం రాత్రి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల పరేడ్ మైదానంలో జరిగింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ వేదపండితులు ఛైర్మన్ కు వేదాశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ భగవంతుని కృప, ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రెండోసారి చైర్మన్ గా అవకాశం వచ్చిందన్నారు. పేదవారికి సాయం చేయాలని తన చిన్నతనంలో తెలుగు మాస్టారు చెప్పిన మాటలు మనసులో నిలిచిపోయాయన్నారు. అప్పటినుంచి అదే ఆలోచనగా జీవిస్తున్నానని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి తనకు తొలిసారి టీటీడీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చిన తర్వాత పేదవారికి సాయం చేయాలన్న తన ఆలోచనలను ఆచరణలో పెట్టే అవకాశం లభించిందన్నారు. టీటీడీ ఛైర్మన్ పదవి ఎన్నో ఉత్కృష్ట పదవుల కంటే చాలా గొప్పదని తన భావన అని ఉద్యోగుల కరతాళధ్వనుల నడుమ తెలిపారు. ఉద్యోగులకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని అడగ్గానే గౌ.ముఖ్యమంత్రివర్యులు అంగీకరించారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేనివిధంగా, వేలాది మంది ఉద్యోగులకు వందలాది ఎకరాల్లో ఇళ్లస్థలాలు ఇవ్వడం తన జీవితంలో మధురానుభూతిని మిగిల్చిందన్నారు.

ఈవో శ్రీ ధర్మారెడ్డి సహకారంతోనే ఉద్యోగులకు మేలు జరిగే పనులు చేయగలిగానని తెలియజేశారు. అదే విధంగా జేఈవో శ్రీ వీరబ్రహ్మం అప్పగించిన పనిని ఎంతో సమర్థవంతంగా నిర్ణీత సమయంలో పూర్తిచేసి ఉద్యోగులకు మేలు చేసేందుకు సహకరించాలని చెప్పారు. కింది స్థాయిలో కష్టపడి పని చేస్తున్న ఉద్యోగులకు న్యాయం జరగాలన్న ఆశయంతోనే తామందరం కలిసి పని చేస్తున్నామన్నారు. టీటీడీలో ఏ ఒక్కరు బాధపడే సందర్భం రాకుండా మరింత బాధ్యతతో అందరికీ లబ్ది కలిగేలా పనిచేస్తామన్నారు. తిరుపతి నగరం దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా నిలిచిపోయిందని, స్వామి వారి ఆశీస్సులతో ఈ పనులన్నీ చేయగలుగుతున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కలిసి తనకు కృతజ్ఞతాపూర్వక ఆత్మీయ సన్మానం చేయడం ఎంతో తృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇది అత్యంత ఆనందదాయకమైన అమృత ఘడియ అన్నారు.

టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ మనకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞతాభావం ఎంత ఎక్కువగా ఉంటే, అంత ఎక్కువగా మనకు కావాల్సినవన్నీ పొందుతామని, ఇది వాస్తవమని తెలియజేశారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత టీటీడీకి మాత్రమే దక్కుతుందన్నారు. భూమి కుటుంబానికి ఒక సామాజిక భద్రతని, ఇది మనకు మాత్రమే కాకుండా మన తరతరాలకు భరోసాగా నిలుస్తుందని తెలియజేశారు. టీటీడీ ఛైర్మన్ శ్రీ కరుణాకరరెడ్డి ఆదేశాలతో ఉద్యోగులకు ఇళ్లస్థలాల మంజూరు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపు ఇతర సంక్షేమ కార్యక్రమాలను చేయగలిగామన్నారు. ప్రభుత్వ జీవో 114ను ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తింపచేసేందుకం ఛైర్మన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుత ఛైర్మన్ పాలనలో ఉద్యోగులందరికీ మరింత మంచి జరుగుతుందని తెలియజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి.రవి మాట్లాడుతూ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి 30 ఏళ్ల కలను సాకారం చేసిన ఛైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగులకు ఏదైనా మంచి జరగాలంటే ప్రస్తుత ఛైర్మన్ హయాంలోనే జరగాలన్నారు. ఉద్యోగుల విషయంలో అన్ని రకాలుగా సహకరిస్తూ మంచి చేస్తున్న శ్రీ భూమన కరుణాకరరెడ్డి చరిత్రలో మిగిలిపోతారని అన్నారు.

అనంతరం పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు మంజూరు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంపు, డిఏ కేసుల క్లియరెన్స్ తదితర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానికుడిగా ఉండి ఉద్యోగుల సమస్యలను తెలుసుకుని వాటిని పరష్కరించిన ఛైర్మన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని ముక్తకంఠంతో తెలిపారు.

ఛైర్మన్ కు ఘనంగా ఆత్మీయ సన్మానం

ఈ సందర్భంగా టీటీడీ సీనియర్ అధికారుల సంక్షేమ సంఘం, శ్రీవారి ఆలయ పోటు కార్మికులు, ఉగ్రాణం కార్మికులు, వాహనం బేరర్లు, ముద్రణాలయం, సేల్స్ వింగ్ సిబ్బంది, ప్రజాసంబంధాల విభాగం సిబ్బంది, రవాణా సిబ్బంది, నిఘా మరియు భద్రతా సిబ్బంది, అన్నప్రసాద విభాగం, కాంట్రాక్టర్స్ అసోసియేషన్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు కలిసి టీటీడీ ఛైర్మన్ ను శాలువలు, పుష్పగుచ్ఛాలు, గజమాలలతో ఘనంగా సన్మానించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.