ఊంజల్ సేవలో ఆకట్టుకున్న శ్రీ సుబ్రహ్మణ్యం భక్తిసంగీతం 

ఊంజల్ సేవలో ఆకట్టుకున్న శ్రీ సుబ్రహ్మణ్యం భక్తిసంగీతం

తిరుపతి, 2023 ఏప్రిల్ 01: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం సాయంత్రం ఊంజల్ సేవలో టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యం బృందం నిర్వహించిన భక్తిసంగీతం ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ‘శరణు శరణు విభీషణ…’, ‘జయ జయ రాఘవ….’, ‘రామచంద్రుడు ఇతడు….’, ‘పొడగంటి మయ్యా పురుషోత్తమ…’, ‘నారాయణ నారాయణ నీ నామమే…’ తదితర కీర్తనలు భక్తిభావాన్ని పంచాయి.

ముందుగా ఉదయం ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు మంగళధ్వని వినిపించారు. ఆ తరువాత డా.డి.హయగ్రీవాచార్యులు ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం భక్తిసంగీతం వీనులవిందుగా సాగింది. రాత్రి శ్రీమతి పిఎం.నాగమణి హరికథాగానం చేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.