GLOBAL RECEPTION FOR SVBC PROGRAMS_ TTD CHAIRMAN DURING 15th ANNIVERSARY OF SVBC _ ఎస్వీబీసీకి విశ్వవాప్త గుర్తింపు- 15వ వార్షికోత్సవంలో టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirupati, 07 July 2023: TTD Chairman Sri YV Subba Reddy said that in the last four years, the SVBC channel has earned global recognition and plans are afoot to take up Dharmic programs for the propagation of Sanatana Hindu Dharma in a widespread manner.

 

Participating in the 15th anniversary celebrations of SVBC at the Channel office premises near Alipiri on Friday morning as Chief Guest the TTD Chairman said particularly during the Covid period when devotees were scared to leave their homes, the SVBC channel under the able guidance of TTD EO Sri AV Dharma Reddy had telecast numerous live Dharmic programs attracting millions and millions of devotees across the globe.

 

He said the telecast of Visuchika Maha Mantra Parayanam, Sundarakanda, Bhagavad Gita, Balakanda and other Parayanams and religious discourses had garnered a huge following.

 

Besides, SVBC YouTube and online FM Radio have also attracted massive acceptance and following from devotees. TTD had built separate studios for telecast shows for Hindi, Tamil and Kannada channels and Undertaken several welfare programs for the channel employees as well.

 

Speaking on the occasion TTD EO and SVBC MD Sri AV Dharma Reddy said the channel produced several devotee-friendly programs in coordination with all TTD organisations and National Sanskrit University.

 

The Parayana Yagnam which commenced during Covid times seeking divine intervention for the well-being of the entire humanity has been continuing. The recently commenced Srimad Bhagavatha pravachanam is viewed by a multitude of devotees across the world, speaks about the range of reception to SVBC programs from devotees.

 

He gave a clarion call to SVBC Channel employees to strive to produce society-friendly and Bhakti programs for the well-being of humanity.

 

SVBC Chairman Dr Saikrishna Yachendra said the dedicated and committed employees are the driving force for the channel.

 

The CEO SVBC Sri Shanmukh  Kumar presented the annual report of the channel and the projected action plan for coming days.

 

Later the TTD Chairman and EO presented the certificates and prizes for the sports and other competitions held to the SVBC employees as part of anniversary celebrations.

 

TTD Board member Sri Nanda Kumar, JEO (H & E) Smt Sada Bhargavi, SV Vedic University Vice Chancellor Acharya Rani Sadasiva  Murty, SVBC board member Smt Vasanta Kavita, advisor Sri Naga Durga Rao, others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

ఎస్వీబీసీకి విశ్వవాప్త గుర్తింపు

– రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలు

– 15వ వార్షికోత్సవంలో టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుపతి, 2023 జూలై 07: నాలుగేళ్ల తమ ధర్మకర్తల మండలి హయాంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో ఎస్వీబీసీ ద్వారా మరింత విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు.

ఎస్వీబీసీ 15వ వార్షికోత్సవం శుక్రవారం తిరుపతిలోని ఛానల్‌ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావడానికి కూడా భయపడిన సమయంలో ఈవో శ్రీ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా చక్కటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేశారని చెప్పారు. ఎస్వీబీసీ ద్వారా ప్రసారం అయిన సుందరకాండ, భగవద్గీత లాంటి పారాయణాలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయన్నారు. తద్వారా ఛానల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులు పెరిగారని, ఎస్వీబీసీ యూట్యూబ్‌, ఆన్‌లైన్‌ రేడియో కూడా భక్తుల ఆదరణ పొందుతున్నాయని చెప్పారు. హిందీ, తమిళం, కన్నడ భాషలకు ఆయా కేంద్రాల్లో స్టూడియోలు నిర్మించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భక్తులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి కూడా మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

టీటీడీ ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమష్టి కృషితో ఛానల్‌ ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. టీటీడీ సంస్థలతోపాటు సంస్కృత విశ్వవిద్యాలయంలోని పండితులు, ప్రవచనకర్తలు, మేధావులను అనుసంధానం చేసి చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. జూలై 3వ తేదీ నుండి ప్రారంభమైన శ్రీమద్‌ భాగవతం ప్రవచనానికి విశేషమైన స్పందన వస్తోందని, యూట్యూబ్‌తోపాటు ఛానల్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని చెప్పారు. భక్తితోపాటు సమాజంలో మంచిని పెంపొందించడానికి జరుగుతున్న కృషిని భవిష్యత్తులో మరింతగా ముందుకు తీసుకుపోవడానికి ఛానల్‌ ఉద్యోగులు పని చేయాలని పిలుపునిచ్చారు.

ఎస్వీబీసీ ఛైర్మన్‌ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ ఉద్యోగులు భక్తిమార్గంలో ఛానల్‌ను ప్రగతిపథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్‌ వార్షిక నివేదికను చదివి వినిపించారు. రాబోయే రోజుల్లో రూపొందించనున్న కార్యక్రమాలను వివరించారు.

వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు నిర్వహించిన వివిధ క్రీడాపోటీల విజేతలకు టీటీడీ ఛైర్మన్‌, ఈవో బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బోర్డులు సభ్యులు శ్రీ నందకుమార్‌, టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీబీసీ బోర్డు సభ్యురాలు శ్రీమతి వసంత కవిత, సలహాదారు శ్రీ నాగదుర్గారావు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.