SV ARTS COLLEGE BAGS PRESTIGIOUS NAAC A + _ ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల అధ్యాప‌కుల‌ను అభినందించిన ఈవో

  • TTD EO COMPLIMENTS COLLEGE FACULTY

 

Tirupati, 14 September 2022:TTD EO Sri AV Dharma Reddy on Wednesday congratulated the SV Arts College, Principal, faculty & staff for bagging the prestigious NAAC A + recognition for the institution.

 

The College Principal Dr Narayanamma led by JEO Smt Sada Bhargavi and DEO Sri Govindarajan formally met TTD EO at his chambers’ in TTD Administrative Building in Tirupati.

 

Speaking on the occasion TTD EO complimented JEO Smt Sada Bhargavi for her leadership in promoting infrastructure in TTD Educational institutions, which made the NAAC A+ recognition possible.

 

Very recently the SP Mahila Degree and PG College too achieved similar NAAC A+ recognition.

 

TTD EO exhorted all TTD institutions to take the above institutions as role model and improve their own standards of education and quality of infrastructure in the institution to achieve higher goals.

 

College lecturers Sri Bhaskarudu, Smt Usha, Smt Vani, Smt Vijayasri, Sri Prasada Rao and Sri Chalapathi were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల అధ్యాప‌కుల‌ను అభినందించిన ఈవో

– ప్ర‌తిష్టాత్మ‌క న్యాక్ ఎ ప్ల‌స్ గ్రేడ్ గుర్తింపు ప‌ట్ల హ‌ర్షం

తిరుప‌తి, 14 సెప్టెంబ‌రు 2022: శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆర్ట్స్ క‌ళాశాల‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన న్యాక్ ఎ ప్ల‌స్ గ్రేడ్ గుర్తింపు ల‌భించ‌డం ప‌ట్ల టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి క‌ళాశాల అధ్యాప‌కులు, సిబ్బందిని అభినందించారు. టిటిడి ప‌రిపాల‌న‌ భ‌వ‌నంలో బుధ‌వారం జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి, డిఇవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, క‌ళాశాల ప్రిన్సిపాల్ డా. నారాయ‌ణ‌మ్మతోపాటు అధ్యాప‌కులు ఈవోను క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి నేతృత్వంలో టిటిడి క‌ళాశాల‌లో విద్య ఇత‌ర మౌళిక స‌దుపాయాలు ఎంతో అభివృద్ధి చెందాయ‌ని చెప్పారు. ఇటీవ‌ల కాలంలోనే శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ, పిజి క‌ళాశాల‌కు కూడా న్యాక్ ఎ ప్ల‌స్ గ్రేడ్ ల‌భించింద‌ని, ఇదేత‌ర‌హాలో ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల‌కు న్యాక్ ఎ ప్ల‌స్ గ్రేడ్ ల‌భించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. టిటిడిలోని ఇత‌ర విద్యాసంస్థ‌లు వీటిని ఆద‌ర్శంగా తీసుకుని మంచి ప్ర‌మాణాలు నెల‌కొల్ప‌డానికి ప‌నిచేయాల‌న్నారు.

ఈవోను క‌లిసిన వారిలో క‌ళాశాల అధ్యాపకులు శ్రీ భాస్క‌రుడు, శ్రీమ‌తి ఉష‌, శ్రీ‌మ‌తి వాణి, శ్రీ‌మ‌తి విజ‌య‌శ్రీ‌, శ్రీ ప్ర‌సాదరావు, శ్రీ చ‌ల‌ప‌తి పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.