ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాలను పరిశీలించిన జేఈవో

ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాలను పరిశీలించిన జేఈవో

తిరుపతి, 2023 సెప్టెంబరు 15: ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్న తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాలను టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి శుక్రవారం పరిశీలించారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విభాగాల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. హాస్టల్ గదులను, మంచాలు, తాగునీటి కొళాయిలు తదితర సౌకర్యాలను పరిశీలించారు.

జేఈవో వెంట చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నారాయణమ్మ, డెప్యూటీ సీఎఫ్ శ్రీ శ్రీనివాసులు, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.