ADMISSION OPENS IN SV ORIENTAL DEGREE COLLEGE _ ఎస్వీ ఓరియంటల్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Tirupati,18 July 2023: Applications are invited from eligible candidates for pre-degree and degree courses at TTDs Sri Venkateswara Oriental Degree College.
For two-year pre-degree courses in Sanskrit, Telugu and Hindi,18 years old candidates with SSC or equivalent exams are eligible.
Similarly for three-year courses in Sanskrit, Telugu and Hindi qualifications candidates with 21 years of age and pre-degree, inter or equivalent exams are eligible.
Interested candidates could obtain applications at KT road college office on payment of ₹25 and submit completed applications by July 21.
Admitted students can avail hostel facilities for boys and girls separately.For more details contact 0877 – 2264604, 0877 – 2263974 during working hours.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ ఓరియంటల్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి, 2023 జులై 18: టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ డిగ్రీ కళాశాలలో ప్రీ డిగ్రీ (ఇంటర్ ), డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల ప్రీ డిగ్రీలో సంస్కృతం, తెలుగు, హిందీ కోర్సులకు 18 ఏళ్ల లోపు వయసు కలిగి ఎస్ఎస్‌సి లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు అర్హులు. మూడేళ్ల సంస్కృతం, తెలుగు, హిందీ కోర్సులకు 21 సంవత్సరాల లోపు వయసు కలిగి ప్రీ డిగ్రీ, ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి.
కె.టి. రోడ్డులోని కళాశాల కార్యాలయంలో రూ.25/- చెల్లించి దరఖాస్తులు పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31వ తేదీలోపు సమర్పించాలి. ప్రవేశం లభించిన విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా ఉచితంగా హాస్టల్ సదుపాయం కల్పిస్తారు. ఇతర వివరాలకు 0877 – 2264604, 0877 – 2263974 నంబర్లను సంప్రదించగలరు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.