ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి, 2012 జూలై 07: 2012-13వ విద్యా సంవత్సరానికి గాను శ్రీ వేంకటేశ్వర బాలమందిరంలో అనాథ బాలబాలిక లను చేర్చుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది. దరఖాస్తుదారులు హిందువు అయి ఉండాలి. వయసు 5 నుండి 10 సంవత్సరాలలోపు ఉండాలి.

దరఖాస్తుదారులు తమకు సంబంధించిన వివరాలను తెల్ల కాగితంపై రాసి, తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థి జనన తేదీ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, సంరక్షకుల ఆదాయ ధ్రువీకరణ పత్రం తదితర జిరాక్సు కాపీలను జత చేయాలి. దరఖాస్తులను జూలై 23వ తేదీ సాయంత్రం 5.00 గంటలలోగా ”సహాయ కార్యనిర్వహణాధికారి,  శ్రీ వేంకటేశ్వర బాలమందిరం, తి.తి.దేవస్థానములు, భవానీనగర్‌, తిరుపతి” అనే చిరునామాకు స్వయంగా కానీ లేదా పోస్టు ద్వారా కానీ అందజేయవచ్చు. ఇతర వివరాలకు 0877-2264613 ఫోన్‌ నంబరులో సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.