EO REVIEW ON SV MUSEUM _ ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపై ఈవో సమీక్ష
Tirumala, 18 Jan. 21: TTD EO Dr KS Jawahar Reddy on Monday reviewed the development works which are underway in the SV Museum at Tirumala in his chambers in TTD Administrative Building.
As part of the review, the corporate Tech groups TATA and Tech Mahindra jointly made a presentation on their action plans for the development of the SV Museum.
TTD EO advised them to design galleries into Six Zones on the ground, first and second floors to enhance the devotional experience of visiting devotees at the entrance itself on the glory of Lord Venkateswara.
He asked them to create a virtual experience about the Srivari temple, Vahana sevas and the divine environment of Sapthagiri Hills at the museum. The TTD EO also wanted officials to focus on the enhanced green cover inside and outside the Museum.
TTD Additional EO Sri AV Dharma Reddy, FA & CAO Sri Balaji, Chief Engineer Sri Ramesh Reddy, SE-2 Sri Nageswara Rao, TATA & Tech Mahindra representatives were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపై ఈవో సమీక్ష
తిరుమల, 18 జనవరి 2021: తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపై టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి సోమవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా టాటా, టెక్ మహింద్రా సంస్థలు సంయుక్తంగా మ్యూజియం అభివృద్ధి ప్రణాళికలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మ్యూజియంలోని గ్రౌండ్, మొదటి అంతస్తు, రెండో అంతస్తులను 6 జోన్లుగా విభజించి గ్యాలరీలు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. భక్తులు లోనికి ప్రవేశించగానే స్వామివారి దివ్యవైభవాన్ని వీక్షించి తరించేలా, ఆధ్యాత్మిక అనుభూతి పొందేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. శ్రీవారి ఆలయం, వాహనాలు, సేవలు, సప్తగిరులకు సంబంధించి వర్చువల్ అనుభవం పొందేలా ఉండాలన్నారు. మ్యూజియం లోపల ఇంటీరియర్, వెలుపల పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈవో కోరారు.
ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వరరావు, టాటా, టెక్ మహింద్రా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.