ఎస్వీ సంగీత కళాశాలలో స్వర్ణోత్సవ సంబరాలు
ఎస్వీ సంగీత కళాశాలలో స్వర్ణోత్సవ సంబరాలు
తిరుపతి, 2010 జనవరి 06: భారతీయ సనాతన సంప్రదాయ కళలైన సంగీత, నృత్య, హరికథ వంటి బోధనాంశాలలో విద్యార్థులను కళాకారులుగా తీర్చిదిద్దటంలో శ్రీవేంకటేశ్వర సంగీత నృత్యకళాశాల తనదైన శైలిలో విజయ ప్రస్థానం సాగిస్తొంది.
1959వ సంవత్సరం అక్టోబర్ 13వ తేదిన అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్యకళాశాలకు శంకుస్థాపన చేసారు. ఇక అప్పటి నుంచి ఇంతింతై వటుడంతై అన్న చందంగా దినదినాభివృద్ది చెందుతూ ఎందరినో సంగీత సామ్రాట్టులుగా తీర్చిదిద్దుతూ 50 వసంతాలు పూర్తి చేసుకొంది.
ఈ సందర్భంగా కళాశాలలో స్వర్ణోత్సవ సంబరాలు మిన్నంటాయి. స్వర్ణోత్సవాలలో భాగంగా రెండవ రోజైన బుధవారం ఉదయం 9 గంటలకు చెన్నైకు చెందిన శ్రీరంగాచారి వారి బృందం గాత్ర కచేరి వీక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. అనంతరం తెనాలి బ్రహ్మనంథాస్త్రి త్యాగరాజ కృతులలో ”రామనామప్రభావం” లయ బద్దంగా ఆలపించి ప్రేక్షకులను మెప్పించారు.
అదేవిధంగా సాయంత్రం 5.30 గంటలకు పద్మశ్రీ అవార్డుగ్రహీత శ్రీనివాస్ ”మాండోలిన్” విన్యాసం ప్రేక్షకులను ఆచర్యకితులను చేసింది. చివరగా 7.30 గంటలకు కళాశాల విద్యార్థినీ, విద్యార్థుల కదంబ కార్యక్రమం జరిగింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.